Tamannah: బోల్డ్‌ పాత్రలే చేస్తానంటున్న తమన్నా !

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. తమన్నా అందానికి ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 18 ఏళ్లు అయినప్పటికీ ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతుండడం గమనార్హం. వరుస ఆఫర్లతో ఎప్పుడు బిజీగా ఉండే తమన్నా ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. కొన్నాళ్ల క్రితం లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఓటిటి ప్రియులను అలరించింది. ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.

Tamannah Bhatia latest hot photoshoot viral on social media

- Advertisement -

ఇదిలా ఉండగా…. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించిన తమన్నా హాట్ కామెంట్స్ చేసింది. లస్ట్ స్టోరీస్ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత బోల్డ్ సీన్స్ పైన నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. బోల్డ్ సీన్స్ లో నటిస్తే తప్పు ఏంటి అని అనుకున్నాను. ప్రేక్షకులు నన్ను అలాంటి సీన్స్ లో చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

అందుకే బోల్డ్ గా నటించానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా వారికి నన్ను నేను చూపించుకోవడం చాలా ముఖ్యం. నటిగా అది నాకు ఎంతో అవసరం. అప్పుడే నన్ను ప్రేక్షకులు ఆరాధిస్తారు అని హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు