Samantha: రామ్‌చరణ్‌ను అవమానించిన సమంత?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి.

దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. తన నటనకు, అందానికి ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత అభిమానులు సమంత చేసిన ఒక పనికి ఫైర్ అవుతున్నారట. వివరాల్లోకి వెళితే….సమంత ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్ ఇండస్ట్రీపైనే పెడుతోంది.

Samantha insulted Ramcharam

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎంత పెద్ద హీరో సరసన నటించే అవకాశం వచ్చినా సరే నో చెబుతుందట. ఈ క్రమంలోనే సమంతకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందట. తమిళ దర్శకుడు వెట్రీమారన్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమాను చేయబోతున్నారట.

- Advertisement -

రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో పక్కన ఆఫర్ వచ్చినప్పటికీ సమంత చేయననడంతో ఇటు సమంతా అభిమానులు, అటు రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలా సినిమా చేయనని చెప్పడంతో రామ్ చరణ్ ను అవమానించిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు