Allu Arjun: అప్పుడు బన్నీ.. ఇప్పుడు చరణ్.. ఇద్దరు కళ్ళు ఆ బ్యూటీ పైనే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి హీరోలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకరు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు మెగా కుటుంబం నుంచి వచ్చిన వారే. అంతేకాదు ఒకే కుటుంబ హీరోలు. అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య… గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుందని చాలామంది ప్రచారం చేస్తూనే ఉన్నారు.

 

ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పుష్ప సినిమా బంపర్ హిట్ అందుకుంది. దీంతో అందరూ పుష్ప 2 ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. పుష్ప 2 లో తృప్తి దిమిరి.. ఐటమ్ సాంగ్ చేస్తుందని మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ బ్యూటీనే దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం అందుతోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్ సినిమాలో కూడా తృప్తి నటించబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్స్ట్ ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో… ఈ సినిమాలో కూడా తృప్తి ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే చిత్ర బృందం చర్చలు చేసిందట. మరి కొన్ని రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు