Niti Taylor: విడాకుల బాట పట్టిన మేం వయసుకు వచ్చాం బ్యూటీ..!

Niti Taylor.. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఎంత వేగంగా అయితే పెళ్లి చేసుకుంటున్నారో .. ఆ తర్వాత అంతే వేగంగా విడాకులు తీసుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. ఇప్పటికే తెలుగులో సమంత – నాగచైతన్య, తమిళ్ లో ధనుష్ – ఐశ్వర్య , మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ – సైంధవి ఇలా చాలామంది విడాకులు తీసుకున్నారు.. తాజాగా ఈ లిస్టులోకి ఇప్పుడు మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు నితీ టేలర్.. హీరో తనీష్ నటించిన మేం వయసుకు వచ్చాం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో దిల్ పాత్రలో కనిపించి తన అందమైన నటనతో తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుంది.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈమెకు వరుస అవకాశాలు లభించాయి.. ఇక అందులో భాగంగానే పెళ్లి పుస్తకం , లవ్ డాట్ కామ్ వంటి సినిమాలు చేసింది.. అయితే ఈ సినిమాలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.. దీంతో సినిమాలు డిజాస్టర్ అయ్యేసరికి ఇండస్ట్రీకి దూరమైంది నితీ.

విడాకులకు సిద్ధమైన నితీ టేలర్..

Niti Taylor: We have reached the age of the divorced woman, beauty..!
Niti Taylor: We have reached the age of the divorced woman, beauty..!

ఇకపోతే ఈమె అభిమానులు రీయంట్రి ఇవ్వాలని కోరినా.. ఆమె ఎక్కడా కనిపించలేదు.. ఆ తర్వాత కొంతకాలానికి ఆర్మీ అధికారి పరీక్షిత్ బవాను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.. 2020లో వీరికి పెళ్లి జరిగింది.. అయితే అంతా బాగానే ఉంది అనుకునే లోపే సడన్గా తన ఖాతాలోని తన పేరు పక్క నుంచి భర్త ఇంటి పేరుని తొలగించింది.. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించింది.. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారు అంటూ కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు తమ భర్తలు లేదా భార్యల నుంచి విడిపోయేటప్పుడు ఇలా మొదట ఇంస్టాగ్రామ్ లో వారి పేర్లను, ఫోటోలను తొలగించి అభిమానులకు తాము విడిపోతున్నామంటూ హింట్ ఇస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ జంట కూడా అలా అన్నింటిని డిలీట్ చేసి హింట్ ఇచ్చారు. ఇక ఇది కూడా నిజం అని నమ్ముతున్నారు అభిమానులు.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే, మొత్తానికైతే నితీ టేలర్ విడాకులు తీసుకోబోతుందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

నితీ టేలర్ విషయానికి వస్తే..

నితీ టేలర్.. హీరోయిన్ గానే కాకుండా టెలివిజన్ స్టార్ గా కూడా మారి పలు టీవీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అలాగే పలు మ్యూజిక్ వీడియోలలో కూడా నటించి మెప్పించింది.. ఎం టీవీ ఇండియా కైసీ యే యారియాన్ లో నందిని మూర్తిగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె ఇక పెద్దగా కలిసి రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమై.. వివాహం చేసుకుంది..ఇక వివాహ జీవితంలో కూడా సంతోషంగా ఉండలేక ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని సమాచారం ..ఏది ఏమైనా ఈ విషయాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by akash thapa (@theakashthapa)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు