Bhaje Vaayuvegam : అనూహ్యంగా పుంజుకున్న కార్తికేయ సినిమా.. రెండో రోజు భారీ గ్రోత్..

Bhaje Vaayuvegam : టాలీవుడ్ లో ఈ వారం మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. ఆ మూడింటికి జనాల్లో మంచి ఆసక్తి నెలకొని ఉండగా, ఆ సినిమాల్లో “భజే వాయువేగం” సినిమాకే పాజిటివ్ టాక్ వచ్చింది. యంగ్ హీరో కార్తికేయ నటించిన ఈ సినిమా ఉన్నంతలో టాక్ పరంగా చూసుకుంటే మిగతా వాటి కంటే బెటర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఓపెనింగ్స్ స్లో గా ఉన్నా డే ఎండ్ అయ్యే టైంకి పుంజుకుంటుంది అనుకున్నా, ఫస్ట్ డే ఎండ్ అయ్యే టైంకి మూడు సినిమాల్లో బెటర్ టాక్ ఉన్నా కూడా వీక్ కలెక్షన్స్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుంది. అయితే మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు అనుకోగా రెండో రోజుకి వచ్చే సరికి మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా జోరు చూపించి ఆల్ మోస్ట్ మొదటి రోజు కన్నా మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దులిపేయడం విశేషం అని చెప్పాలి.

Bhaje Vaayuvegam movie 2days collections

రెండో రోజు సాలిడ్ గ్రోత్..

ఇక “భజే వాయువేగం” (Bhaje Vaayuvegam) సినిమా రెండో రోజు ఆల్ మోస్ట్ కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.3 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ జోరు చూపించింది. దాంతో టోటల్ గా సినిమా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే.. నైజాం లో 60లక్షలు, 70 లక్షలు వసూలు చేయగా, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ సహా మరో 25 లక్షలు రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 1.55 కోట్ల షేర్ సాధించిన భజే వాయువేగం సినిమా 3.25 కోట్ల గ్రాస్ రాబట్టింది.

- Advertisement -

వీకెండ్ గ్రోత్ రావాల్సిందే…

మొత్తం మీద భజే వాయువేగం (Bhaje Vaayuvegam) సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 4 కోట్ల దాకా ఉండగా రెండో రోజు సాలిడ్ గ్రోత్ హెల్ప్ తో సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం మరో 2.45 కోట్ల రేంజ్లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమా వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అయితే ఈ వీకెండ్ ఆదివారం నాడు మరిన్ని వసూళ్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. రెండో రోజు లాగానే మూడో రోజు కూడా గ్రోత్ చూపిస్తే బ్రేక్ ఈవెన్ మరింత సులువుగా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక కార్తికేయ నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు