Kalki 2898AD: కల్కి సినిమా అర్ధరాత్రి నుంచే మొదలుకానుందా.? ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంకా పండగేనా.?

Kalki 2898AD: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయాయి. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ కెరియర్ కు మంచి కం బ్యాక్ అయింది. మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా కల్కి.

Kalki 2898 AD

మైథిలాజికల్ సైన్స్ ఫిక్స్ జోనర్

కల్కి సినిమా గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా ఒక మైథిలాజికల్ సైన్స్ ఫిక్స్ జోనర్ లో రానుంది. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న మూడవ సినిమా ఏది. మహానటి సినిమాతో ఎంత పెద్ద గుర్తింపుని సాధించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆడియన్స్ సినిమాకు రావడం మానేశారు అనుకున్న తరుణంలో, ఒక మంచి సినిమా తీస్తే ఆడియన్స్ థియేటర్లకు పరుగులు పెట్టుకుంటూ వస్తారు. అని మహానటి సినిమాతో నిరూపించాడు.

- Advertisement -

అర్ధరాత్రి నుంచి మొదలు కానున్నాయి

ఇక రీసెంట్ టైమ్స్ లో బెనిఫిట్ షోస్ ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది అనుకున్న తరుణంలో రిలీజ్ ముందు రోజు నైట్ 1am వేస్తుంటారు. ఈ షో కి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ఆడియన్స్ ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదివరకే సలార్ సినిమా కూడా ఇలానే షోస్ వేశారు. అయితే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు కల్కి సినిమాకు కూడా నైజాంలో రాత్రి నుంచి షో స్ మొదలుకానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఈ సినిమా షో స్ ఆధారపడనున్నాయి. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు