Ajay Ghosh: కొండా రెడ్డి పాత్ర నాకు నిజంగా పునర్జీవనాన్ని ఇచ్చింది

Ajay Ghosh: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటులలో అజయ్ ఘోష్ ఒకరు. కేవలం తెలుగులోని మాత్రమే కాకుండా తమిళ్లో కూడా మంచి గుర్తింపును సాధించుకున్నాడు. తన స్వస్థలం బాపట్లలో సిటీకేబుల్ లో స్టేజ్ యాక్టర్ గా న్యూ శ్రీదర్గా కొంతకాలం పనిచేసిన తర్వాత డిడి తెలుగు ఛానల్ ద్వారా నటనలోకి ఎంట్రీ ఇచ్చాడు. దర్శకత్వంలో వచ్చిన విచారణ సినిమా అజయ్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అజయ్ ఘోష్ ప్రస్తుతం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే దీనికి కారణం పుష్ప సినిమా.

రంగస్థలంతో మరింత గుర్తింపు

తెలుగులో ప్రస్థానం ఆటోనగర్ సూర్య, జ్యోతిలక్ష్మి, ఎక్స్ప్రెస్ రాజా వంటి ఎన్నో సినిమాలను చేశాడు. అయితే సుకుమార్ సినిమాలతో అజయ్ కు మంచి గుర్తింపు లభించింది. సుకుమార్ కెరియర్ లో రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో అలాంటి సినిమా వస్తుందని ఎవరు ఊహించుకోవడం ఉండరు. అంత అద్భుతంగా రంగస్థలం అనే సినిమాను చేశాడు సుకుమార్. రామ్ చరణ్ కెరియర్ లో కూడా ఇది ఒక బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో అజయ్ పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రెసిడెంట్ పక్కన పనిచేసే వ్యక్తిగా కనిపించిన అజయ్ తనదైన శైలిలో విలనిజం పండించాడు. ఇక్కడితో అజయ్ కు మరింత గుర్తింపు లభించింది.

మ్యూజిక్ షాప్ మూర్తి గా ప్రేక్షకుల ముందుకు

ఇకపోతే ప్రస్తుతం అజయ్ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాను చేస్తున్నాడు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. లేకపోతే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దేవిశ్రీప్రసాద్ సినిమా సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే రిలీజ్ అయిన పాటలు కూడా ఈ సినిమా పైన మంచి ఆసక్తిని పెంచుతున్నాయి.

- Advertisement -

Ajay Ghosh

కొండారెడ్డి పాత్ర నాకు పునర్జీవాన్ని ఇచ్చింది

అజయ్ ఘోష్ పుష్ప సినిమాలో కొండారెడ్డి అని ఒక కీలక పాత్రలో కనిపించాడు. అయితే ఈ కొండారెడ్డి పాత్ర పుష్ప సినిమాలో చనిపోతుంది. ఇప్పుడు వస్తున్న పుష్పా 2 సినిమాలో కనిపించి ఆస్కారం లేదు. అయితే ఇదే విషయంపై మాట్లాడుతూ పుష్ప 2 సినిమాలో నా పాత్ర లేదు. నేను నటించలేకపోయాను అనే బాధ కూడా నాకు లేదు నా కెరియర్ అయిపోయింది అనుకుంటున్నా టైంలో కొండారెడ్డి పాత్ర నాకు పునర్జీవాన్ని ఇచ్చింది. నాకు ఆ సంతృప్తి చాలు అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు