Pushpa The Rule: ఆడియెన్స్ లో పుష్ప రేంజ్ మామూలుగా లేదుగా

Pushpa The Rule: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన బిగ్గెస్ట్ ఫిలిమ్స్ లో పుష్ప సినిమా ఒకటి. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ అంచలంచెలుగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ ఒక స్థాయికి ఎదిగారు. ఇప్పుడున్న దర్శకులలో రాజమౌళి తర్వాత తెలుగు సినిమాను ఆ స్థాయికి తీసుకెళ్లడంలో సుకుమార్ కూడా కీలకపాత్ర పోషించారని చెప్పొచ్చు. సుకుమార్ సినిమా విషయానికి వస్తే రంగస్థలం ముందు రంగస్థలం సినిమా తర్వాత అని చెప్పొచ్చు. రంగస్థలం సినిమాకు ముందు సుకుమార్ హీరోలంతా చాలా స్టైలిష్ గా, ఇంటెలిజెంట్ గా ఉండేవాళ్ళు. అలానే రంగస్థలం సినిమాలో కూడా హీరో చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాడు. అయితే సుకుమార్ రంగస్థలం సినిమాని చాలా రా & రస్టిక్ ఇంట్రెస్ట్ గా తీశాడు.

బాలీవుడ్ లో ప్రభంజనం

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా పుష్ప. పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మామూలుగా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పరవాలేదు అని చాలామంది అన్నారు. కానీ బాలీవుడ్లో ఈ సినిమా సంచలనానికి ఈ తెర తీసింది. ఈ సినిమా సాంగ్స్ ని క్రికెటర్స్, పొలిటిషన్ ఇమిటేట్ చేయటం వలన ఈ సినిమాకి మరింత గుర్తింపు లభించింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ ను చాలామంది ప్రముఖులు విరివిగా వాడేసారు. దానివలన ఈ సినిమాకి మరింత గుర్తింపు లభించి ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి.

కాంబినేషన్ అలాంటిది

ఆర్య సినిమా తో అల్లు అర్జున్ సుకుమార్ మొదటిసారి కలిసి జర్నీ స్టార్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ కు సుకుమార్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సందర్భంలో నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు అని వెనక్కి తిరిగి చూసుకుంటే నా వెనక సుకుమార్ మాత్రమే ఉన్నారు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు వేరే రేంజ్ లో ఉంటాయి. వీరిద్దరూ కలిసి చేసిన మూడువ సినిమా పుష్ప. పుష్ప సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు పుష్ప సీక్వెల్ కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

- Advertisement -

Pushpa The Rule

సాంగ్స్ ట్రెండింగ్ మామూలుగా లేదు

పుష్ప సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న కారణంగా, ఈ సినిమా నుంచి ఇదివరకు రెండు పాటలను రిలీజ్ చేశారు. మొదటి పాట పుష్పాకి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. రెండవ పాట కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. అయితే ఈ కపుల్ సాంగ్ ను చంద్రబోస్ రచించగా, దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. శ్రేయ ఘోషల్ ఈ పాటను పాడారు. ఈ పాట విపరీతంగా ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. ఈ పాటకు ఇప్పటికే లక్ష రీల్స్ ను చేశారు. ఒక పాట ఎంతో హిట్టయితే గాని ఈ రేంజ్ లో రెస్పాన్స్ అనేది రాదు. మీ పరిణామాలన్నీ చూస్తుంటే పుష్పాకి ఆడియన్స్ లో రెస్పాన్స్ ఒక రేంజ్ లో ఉంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు