Rajinikanth : వరుస సినిమాలతో రజిని బిజీ.. ఏ షెడ్యూల్ ఎక్కడంటే?

Rajinikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మాస్ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మాత్రం ‘లాల్ సలామ్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అందుకున్నారు. ఇందులో ప్రత్యేక పాత్రలో నటించాడు రజిని. ఇక ఈ సినిమా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించగా, ఆమెకు డిజాస్టర్ రాగా ఆ సినిమాపై రజిని ఫ్యాన్స్ కూడా ఆమెపై ఆగ్రహించారు. ఏది ఏమైనా జయాపజయాలతో సంబంధము లేకుండా రజిని తన నెక్స్ట్ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఇక రజినీకాంత్ ప్రస్తుతం ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో “వేట్టయాన్” అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ వంటి భారీ స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Rajinikanth is completing the shooting of two films simultaneously

వరుస షెడ్యూల్స్ తో బిజీ..

ఇక రజినీకాంత్ (Rajinikanth) తన వరుస సినిమాల షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో గ్రాండ్‌ గా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇదివరకే ప్రకటించింది. అయితే తాజాగా రజినీకాంత్ స్వయంగా వేట్టయాన్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఓ స్వామిని కలిసిన రజినీ ఆయనతో మాట్లాడుతూ వేట్టయాన్ రిలీజ్ డేట్ చెప్పారు. వేట్టయాన్ కోసం తన పోర్షన్స్ పూర్తి చేశానని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రజినీ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుందని సమాచారం. ఇక ఈ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు రజిని.

- Advertisement -

ఒకేసారి చెన్నై ముంబై లో బిజీ..

అయితే రజినీకాంత్ తన రెండు సినిమాలను ఏక కాలంలో షూటింగ్ ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా వెట్టయాన్ షూటింగ్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్య కారణాల దృష్ట్యా అప్పుడప్పుడు ముంబైలో షూట్ చేస్తున్నారు. ఇక రజిని కూడా ముంబై షెడ్యూల్ లో పాల్గొంటూనే, చెన్నై లో లోకేష్ కానగరాజ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ సినిమాకు కూలి అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ కూలీ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక వెట్టాయన్ సినిమా షూటింగ్ అక్టోబర్ లో విడుదల కానుండగా, కూలీ ఈ ఏడాది కల్లా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ పొంగల్ బరిలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఈ సినిమాల షూటింగ్ పూర్తి అయ్యాకే తదుపరి సినిమాల ప్రాజెక్టులను రజిని మొదలు పెడతాడని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు