Toxic: యష్ టాక్సీక్ మూవీ కాస్టింగ్ రీవీల్

Toxic: కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా తెలుగులో మంచి గుర్తింపును సాధించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా ప్రపంచమంతా కూడా కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు చూడటం మొదలుపెట్టింది. ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు తో తెలుగు హీరోలు కూడా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. కే జి ఎఫ్ సినిమాకి సీక్వల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి కాసులు వర్షం కురిపించింది.

డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్

ఇకపోతే అప్పటినుంచి యష్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇకపోతే ప్రస్తుతం ఎస్ టాక్సీక్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా 2025 లో విడుదలకు సిద్ధంగా ఉంది. 1960వ దశకంలో గోవాలోని డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ఫిలింనగర్ టాక్. అలాగే అండర్ వరల్డ్, చీకటి వ్యాపారాలు, స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన అంశాలను టాక్సిక్‌లో టచ్ చేసే అవకాశం వుందని సమాచారం. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కరీనాకపూర్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆమె తప్పుకున్నట్లు కూడా కథనాలు వినిపించాయి.

Nayanathara

- Advertisement -

ఫుల్ కాస్టింగ్ డీటెయిల్స్

ఇక ఈ సినిమాలో యశ్ తో జంటగా త్రిప్తి దిమిరి నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ప్లేస్ లో కియారా అద్వానీని తీసుకున్నారు. నయనతార ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. యశ్ కు ఈ సినిమాలో సిస్టర్ రోల్ లో కనిపించనున్నారు నయనతార. అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా గుర్తింపు సాధించుకుంది నయనతార. ఈ ప్రాజెక్టులో నయనతారని తీసుకోవడం వలన అక్కడ కూడా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలు హుమా కురాశి విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. వీటి గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు