Kriti Shetty: ఆ హీరో పై మనసు పారేసుకుంటున్న కృతి.. ఒక్క ఛాన్స్ అంటూ..!

Kriti Shetty.. ప్రముఖ శాండిల్ వుడ్ బ్యూటీ కృతి శెట్టి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన డెబ్యూ మూవీ ఉప్పెన.. ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని విపరీతమైన అభిమానాన్ని సొంతం చేసుకుంది.. తెలుగు ప్రేక్షకులు కూడా ఈమెను బాగా ఓన్ చేసుకున్నారు. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో వరుసగా పలు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. అలా శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలలో కూడా నటించి ఏకంగా హ్యాట్రిక్ అందుకుంది.

హ్యాట్రిక్ కొట్టాక వరుస పరాజయాలు..

అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కథల ఎంపిక విషయంలో కాస్త తడబడిందని చెప్పా..లి అలా ఈమె నటించిన ఏ సినిమా కూడా విజయాన్ని అందించలేదు.. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమవుతుందనే వార్తలు కూడా వినిపించాయి.. కానీ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట ప్రభూ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.. కానీ ఈ సినిమా కూడా విజయం సాధించలేదు. ఇక దీంతో టాలీవుడ్ లో అవకాశాలు కనుమరుగయ్యాయని, తెలుగు ఇండస్ట్రీకి కూడా దూరం కాబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.. అందుకు తగ్గట్టు గానే అవకాశాలు కూడా రాలేదు.. దాంతో తమిళ్లో పలు చిత్రాలు చేస్తూ అక్కడే బిజీగా మారింది..

మనమే మూవీతో ప్రేక్షకుల ముందుకు..

తాజాగా ఈమె చాలా రోజుల తర్వాత శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమాలో నటించింది.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయగా.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రం విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఇక జూన్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్నారు చిత్ర బృందం.. అందులో భాగంగానే కృతి శెట్టి కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది.

- Advertisement -

రామ్ చరణ్ తో నటించడమే నా డ్రీమ్..

Kriti Shetty: Kriti is throwing her heart on that hero.. She says there is only one chance..!
Kriti Shetty: Kriti is throwing her heart on that hero.. She says there is only one chance..!

ఇందులో భాగంగానే తన ఫేవరెట్ హీరో గురించి మాట్లాడింది.. తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.. నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గతంలో కూడా కొన్ని తెలుగు సినిమాలు చూసాను.. అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమా అంటే చాలా ఇష్టం.. ఆయన నటన అద్భుతంగా ఉంటుంది.. అప్పటినుంచి ఆయనకు నేను పెద్ద అభిమానిని అయిపోయాను.. అంతేకాదు ఆయన గురించి ఎంతో విన్నాను కూడా.. వర్కులో చాలా డెడికేటెడ్ గా ఉంటారని..మంచి పర్సన్ అని.. అందరికీ రెస్పెక్ట్ ఇస్తారని కూడా విన్నాను.. ఇక రాంచరణ్ తో ఛాన్స్ వస్తే చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతాను ..ముఖ్యంగా ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే ఎంత రిస్క్ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

కృతి శెట్టి కోరిక తీరేనా..

మొత్తానికైతే కృతి శెట్టి రామ్ చరణ్ గురించి ఈ రేంజ్ లో చెప్పడంతో రామ్ చరణ్ అభిమానులు చాలా ఎక్సైట్ అవుతున్నారు.. చరణ్ అంటే ఇంత ఇష్టమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఫ్యూచర్లో రామ్ చరణ్, కృత్తి శెట్టి కలసి నటిస్తారేమో చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే కృతి శెట్టి కలలు నిజమవుతాయి అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు