Jyothika: ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లు అందరూ చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ వారి ఇమేజ్ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ఇండస్ట్రీలో ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్గా జ్యోతిక ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే.
తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ ఓ స్టార్ హీరోకి తల్లి పాత్రలో పోషించబోతుందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న హీరో నాగచైతన్య ప్రజెంట్ తండేల్ అనే మూవీ షూట్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ కోసం ఎంత కష్టపడుతున్నాడో మనందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నాగచైతన్య ఈ సినిమా అయిపోగానే కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. విరూపాక్ష డైరెక్టర్ కావడంతో అలాంటి కథను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే సెట్ అయినట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో నాగచైతన్యకు తల్లి పాత్రలో హీరోయిన్ జ్యోతిక నటించబోతుందట. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఈ వార్తను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.