Mangli: ధూంధాం మూవీ నుంచి సాంగ్ రిలీజ్.. మంగ్లీనా మజాకానా..!

Mangli: ఫోక్ సింగర్ మంగ్లీ ఇండస్ట్రీలో ఎటువంటి పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. వరస హిట్ సాంగ్స్ తో టాలీవుడ్ లో తనదైన ముద్రవేసింది ఈ బ్యూటీ. ఇక ఆమె పాడిన పాటలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

ఆమెతో కనీసం ఒక ఫోక్ సాంగ్ పాడిస్తే.. తమ సినిమాకు మంచి బూస్ట్ వస్తుందని టాలీవుడ్ మేకర్స్ భావిస్తున్నారు. అంతటి క్రేజ్ ని తెచ్చుకుంది మరి మంగ్లీ. ఇక ఈ సింగర్ తాజాగా మరో కొత్త సాంగ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిస్మరైజ్ చేసేందుకు రెడీ అయింది.

Star singer Mangli is getting marriage
Star singer Mangli is getting marriage

ధూంధాం అనే కొత్త మూవీలో ప్రముఖ లిరిసిస్ట్ రామా జోగయ్య శాస్త్రి రాసిన ” మల్లె పూల టాక్సీ ” అనే సాంగ్ను మంగ్లీ పాడారు. పాటకు సంబంధించిన ప్రోమో మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాట ప్రోమో అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పూర్తి పాటని జూన్ 5న ఉదయం 9:18 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు