Singer chinmayi: సింగర్ చిన్మయి.. పరిచయం అవసరంలేని పేరు. తన గానంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక తన గానంతో ఎంత ఫేమస్ అయిందో.. అంతకంటే ఎక్కువ... తన కాంట్రవర్షియల్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక సంఘటనపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.
ఈమె దేశంలో జరిగే అత్యాచారాల మీద స్పందిస్తూనే ఉంటుంది. ఎంత ట్రోలింగ్ జరిగిన.. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా.. తాను చేసే పనుల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టదు చిన్మయి. అటువంటి చిన్మయి తాజాగా ట్రోల్స్ చేసే వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ” దానిమీద ఎందుకు స్పందించలేదు.. దీని మీద ఎందుకు స్పందించలేదు.. భయపడ్డావా?.. నీకు దమ్ముంటే స్పందించు?.. గట్స్ ఉంటే స్పందించు?.. అని రకరకాలుగా కామెంట్స్ పెట్టారు.
కానీ అలా కామెంట్స్ పెట్టేవారు మాత్రం.. సొంతంగా.. సొంత పేరుతో ఎకౌంట్లు క్రియేట్ చేసుకునే దమ్ము అయితే ఉండదు. ఫేక్ ఐడీలు, ఫేక్ పేర్లు, ఫేక్ ఫోటోలతో ఎకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు.. ముందు మీరు మీ పేర్లతో ఒరిజినల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు దమ్ముంటే ముందు ఆ పని చేయండి. ఆ తర్వాత అడగండి ” అంటూ ట్రోల్స్ చేసే వారికి సవాళ్లు విసిరింది చిన్నయి. ప్రెసెంట్ ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.