Love today: లవ్ టుడే రీమేక్.. హీరో హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్..!

Love today: లవ్ టుడే.. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటమే కాదు.. ఈ కాన్సెప్ట్ రియల్ గా కూడా వర్క్ అవుట్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమా విడుదలైన తర్వాత చాలామంది లవర్స్ తమ ఫోన్స్ ను ఎక్సేంజ్ చేసుకుని మరీ తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించి రియల్ గా విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు.. ఇలాంటి ఒక సంచలనం సృష్టించిన సినిమా రీమేక్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఇందులో నటించే నటీనటులు ఎవరో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.. 2022లో వచ్చిన ఈ సినిమా తమిళ్లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకొని. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటించింది.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.. తెలుగులో కూడా ఈ సినిమా డబ్బింగ్ అయి మంచి విజయం సాధించింది.

బాలీవుడ్ లో లవ్ టుడే రీమేక్..

Love today: Remake of Love today.. Shock if you know who the hero and heroine are..!
Love today: Remake of Love today.. Shock if you know who the hero and heroine are..!

కేవలం రూ .5కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.. ప్రస్తుతం నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది . అయితే ఈ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారని గతం నుండి వార్తలు వినిపించగా .. ఇప్పుడు మరొకసారి బాలీవుడ్ లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.

నటీనటులు వీరే..

ఇందులో నటీనటుల విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా.. జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ హీరోయిన్ గా, అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

జునైద్ ఖాన్ సినిమాలు..

ఇదిలా ఉండగా ఇటీవలే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన మొదటి సినిమా మహారాజా.. ఇంకా విడుదల కాలేదు.. మరోవైపు ఖుషి కపూర్ కూడా ఒక సినిమా చేసింది.. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి లవ్ టుడే రీమేక్ లో నటించబోతున్నారని సమాచారం.. నిజానికి సౌత్ నుంచి డబ్బింగ్ అయినా ఏ సినిమా కూడా నార్త్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మరి సౌత్ ప్రేక్షకులను మెప్పించిన ఈ లవ్ టుడే చిత్రం నార్త్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.. మొత్తానికైతే రూ .5కోట్ల బడ్జెట్తో రూ.100 కోట్లు రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్లో ప్రేక్షకులను మెప్పించి అక్కడ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

ఖుషీ కపూర్ సినిమాలు..

ఇక ఖుషీ కపూర్ విషయానికి వస్తే.. దివంగత నటీమణి శ్రీదేవి చిన్న కూతురుగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె సినిమాలలో చేసింది తక్కువే అయినా గ్లామర్ విషయంలో అక్కతో పోటీపడుతూ హాట్ అందాల వలకబోస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఇక మరొకవైపు ఈమె అక్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవరా సినిమా చేస్తున్న ఈమె ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో కూడా ఒక సినిమాను చేస్తోంది. ఇక ఈ సినిమాల తర్వాత మరో స్టార్ హీరోకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు