Inside Out 2 : పాపులర్ యానిమేషన్ చిత్రం ‘ఇన్ సైడ్ అవుట్’ రెండో భాగం త్వరలో విడుదల కానుంది. తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రం సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ‘ఇన్సైడ్ అవుట్ 2’ హిందీ వెర్షన్ కు ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..
విజయ్ దేవరకొండ హీరోయిన్ గాత్రదానం
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ అనన్య పాండే. ఈ బాలీవుడ్ హీరోయినే ఇప్పుడు ఇన్ సైడ్ అవుట్ అనే హాలీవుడ్ మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వబోతోంది.
డిస్నీ ఫిలింస్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఈ మూవీలోని ఓ పాత్ర కోసం అనన్య వాయిస్ ఇస్తోందన్న విషయాన్ని వెల్లడించింది. ‘ఇన్సైడ్ అవుట్ 2’ హిందీ వెర్షన్లో రిలే అనే అమ్మాయి పాత్ర కోసం అనన్య పాండే తన గాత్రాన్ని అందించింది.
డిస్నీ, పిక్సర్ చిత్రాలకు వీరాభిమాని
ప్రేక్షకుల మాదిరిగానే అనన్య పాండే కూడా ‘ఇన్సైడ్ అవుట్ 2’ రిలీజ్ గురించి ఉత్సాహంగా ఉంది. ఆమె స్వయంగా డిస్నీ, పిక్సర్ యానిమేషన్ చిత్రాలకు అభిమాని. టీనేజ్ లో ఉన్నప్పుడు ‘ఇన్సైడ్ అవుట్’ చూసింది అనన్య. ఇక తాజాగా తాను ఇన్ సైడ్ అవుట్ 2 లో భాగం కావడం గురించి మాట్లాడుతూ డిస్నీ, పిక్సర్ కథలు మనల్ని చాలా వినోదభరితమైన ప్రపంచానికి తీసుకెళ్తాయని, ఏదో ఒక రోజు తాను కూడా ఈ కథలో భాగమవుతానని కలలో కూడా ఊహించలేదని అనన్య చెప్పింది.
ఫస్ట్ పార్ట్ కు ఆస్కార్
‘ఇన్సైడ్ అవుట్’ సీక్వెల్ కోసం యానిమేషన్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. ‘ఇన్సైడ్ అవుట్ 2’ పూర్తి కామెడీ కథాంశంతో ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి కెల్సీ మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2024 జూన్ 14న విడుదల కానుంది. హిందీ, ఇంగ్లిష్ రెండు భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మిస్తోంది.
అనన్య మూవీస్
అనన్య చివరిసారిగా ‘ఖో గయే హమ్ కహాన్’ అనే మూవీలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ అనన్య విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తున్న ‘కంట్రోల్’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉంది. మరోవైపు అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్‌లతో కలిసి ‘శంకర’ మూవీలో కనిపించనుంది.
స్టార్ హీరోతో బ్రేకప్
అనన్య పాండే ఇటీవలే బాలీవుడ్ స్టార్ ఆదిత్య రాయ్ కపూర్ తో బ్రేకప్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. దాదాపుగా రెండేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా విడిపోయారు అనే రూమర్లపై ఆదిత్య ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత విషయం గురించి ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అనన్య ఇంకా ఈ విషయం గురించి మాట్లాడలేదు.