Tollywood Star Hero’s: మన టాలీవుడ్ హీరోల వీక్నెస్ ఏంటో తెలుసా..?

Tollywood Star Hero’s.. సాధారణంగా దర్శకనిర్మాతలు ఒక సినిమాను చేయాలనుకున్నప్పుడు ముందుగా తాము అనుకున్న హీరో దగ్గరికి వెళ్లి డేట్స్ కోసం అడుగుతూ ఉంటారు. ఇక హీరోల డేట్స్ దొరికాయి అంటే ఇక వారికి పండగే.. మరి ఆ హీరోలను ఇంప్రెస్ చేయడం ఎలా?.. ముఖ్యంగా మన స్టార్ హీరోల వీక్నెస్ పాయింట్ ను పట్టుకుంటే కచ్చితంగా వారిని ఒప్పించేయొచ్చు అనే వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ప్రభాస్ లకు కొన్ని బలహీనీతలు ఉన్నాయట .ఆ వీక్నెస్ మీద కొడితే దెబ్బకు డేట్స్ ఇచ్చేస్తారని దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలిపిన మేరకు మన స్టార్ హీరోల వీక్నెస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Tollywood Star Hero's: Do you know the weakness of our Tollywood heroes?
Tollywood Star Hero’s: Do you know the weakness of our Tollywood heroes?

తాజాగా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయంపై ఒక జోక్ వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది వాస్తవం కాకపోయినా పూరి జగన్నాథ్ క్రియేట్ చేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి మన తెలుగు హీరోల వీక్నెస్ ఏంటి? వారి వీక్నెస్ ను దర్శక నిర్మాతలు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలు పూరీ జగన్నాథ్ మాటల్లోనే మనం ఇప్పుడు ఉందాం..

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. టాలీవుడ్ లో ఒక జోక్ ఉంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ , ప్రభాస్, మహేష్ బాబు, రవితేజలకు ఇలా చెప్పితే మాత్రం ఖచ్చితంగా వెంటనే వారి డేట్స్ ఇచ్చేస్తారు అంటూ తెలిపారు పూరి జగన్నాథ్

- Advertisement -

పవన్ కళ్యాణ్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ఆయనకు ముందుగా కథ చెప్పేటప్పుడు ఎవరైనా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.. కథ చెప్పేటప్పుడు ఈ సినిమాలో అన్నీ గన్సే.. విలన్ పెద్ద గన్ లీడర్ ..విచ్చలవిడిగా గన్స్ తో కాల్చుకోవచ్చు అని చెబితే చాలు పవన్ కళ్యాణ్ వెంటనే డేట్స్ ఇచ్చేస్తారట ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ వెల్లడించినట్లు సమాచారం.

ప్రభాస్:

ప్రస్తుతం కల్కి 2898 AD చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ప్రభాస్ ఈ సినిమాను జూన్ 27వ తేదీన రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఒక వీక్నెస్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. షూటింగ్ మొత్తం ఇండోర్లోనే అవుట్ డోర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెబితే చాలట ప్రభాస్ ఇట్టే డేట్స్ ఇచ్చేస్తారని సమాచారం.

ఎన్టీఆర్ :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈయనకు కథ చెప్పేటప్పుడు ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలే చరిత్ర తీరగరాయబోతున్నామని చెబితే ఎన్టీఆర్ ఇంప్రెస్ అయిపోయి డేట్స్ ఇచ్చేస్తారట.

మహేష్ బాబు:

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈయనకు కథ చెప్పేటప్పుడు షూటింగ్ ఇప్పుడు మొదలైతే ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు అని చెబితే వెంటనే డేట్స్ ఇచ్చేస్తారట.

రవితేజ:

మాస్ మహారాజా రవితేజకు కథ చెప్పే ముందు జస్ట్ 30 రోజుల్లోనే సినిమా షూటింగు పూర్తి అవుతుంది అని..ఇలా చెబితే కచ్చితంగా ఆయన డేట్స్ ఇస్తారని సమాచారం. ఇలా మొత్తానికైతే ఈ వీక్నెస్ తెలిస్తే ఖచ్చితంగా వారిని ఒప్పించడం మరింత సులభం అవుతుందని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు