OTT Movie : ఏఐ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలా? టెక్నాలజీ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టించే మూవీ

OTT Movie : టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్, టెర్మినేటర్ చిత్రాలలో రోబోలు విలన్‌లుగా ఉండడం ఇప్పటికే చూశాము మనం. కానీ అదే ఏఐ హద్దులు దాటి మానవాళికి ప్రమాదంగా మారితే, మానవ జీవి అన్నదే లేకుండా అంతం చేయాలి అనుకుంటే? వినడానికి భయంకరంగా ఉంది కాదా.. ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే..

800 కోట్ల బడ్జెట్ యాక్షన్ మూవీ

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ 800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ మూవీ పేరు అట్లాస్. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇంగ్షీషు తో సహ పలు భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు సైన్స్ ఫిక్షన్, ఏఐ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారైతే ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. జెన్నిఫర్ లోపెజ్ ఈ ఏఐ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది.

Atlas Review Ratings | Atlas Movie Review | Netflix Atlas Movie Review |  Jennifer Lopez Atlas Review Ratings - Filmibeat

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే?

అట్లాస్ తల్లి ఓ ఏఐ రోబో మేకర్. ఆమె తనకంటే ఎక్కువగా తన రోబో అన్నయ్యనే ఇష్టపడడం అట్లాస్ కు నచ్చదు. కానీ అట్లాస్ మదర్ మాత్రం దానిని డెవలప్ చేయడానికి చాలా సమయం కేటాయిస్తూ కూతురిని పట్టించుకోదు. అది నచ్చని అట్లాస్ తల్లికి తెలియకుండా రోబో అన్నయ్య హర్లాన్ దగ్గరకు వెళ్ళి తనను పర్ఫెక్ట్ గా మార్చమని కోరుతుంది. అయితే మనుషుల మైండ్ తో కనెక్ట్ అయ్యి రోబోలు కంట్రోల్ లో ఉండేలా అట్లాస్ తల్లి ఏర్పాటు చేసిన ఓ యంత్రం ద్వారా హర్లాన్, అట్లాస్ ఈ ప్రయత్నం చేస్తారు.

కానీ అట్లాస్ మైండ్ లోకి దూరి మనుషుల ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకున్న హర్లాన్ తనను క్రియేట్ చేసిన తల్లినే చంపేస్తాడు. అట్లాస్ అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తరువాత చాలామందిని చంపేసిన హర్లాన్ మనుషుల ధాటికి తట్టుకోలేక వేరే గ్రహానికి పారిపోతాడు. మరోవైపు పెద్దదైన అట్లాస్ చాలా తెలివిగా వ్యవహరిస్తూ అతన్ని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తుంది, అనుకున్నట్టుగానే హర్లాన్ జాడను తెలుసుకుని ఫోర్స్ తో అక్కడికి వెళ్తుంది. వేరే గ్రహం కాబట్టి తమను అన్నీ పరిస్థితుల నుంచి కాపాడే రోబో లను కవచంగా మార్చుకుని, తమ ఆలోచనలకు తగ్గట్టుగా నడిచే రోబోలతో అక్కడికి వెళతారు. కానీ ఆ మిలటరీ ఫోర్స్ హర్లాన్ ను తక్కువ అంచనా వేస్తుంది. అక్కడికి వెళ్ళిన క్షణాల్లోనే అందరినీ మట్టుబెట్టేస్తాడు హర్లాన్. ఒక్క అట్లాస్ మాత్రం తప్పించుకుంటుంది. డిలాబ్ అనే వెపన్ తో అతను ప్రపంచాన్నే నాశనం చేయాలనే ప్లాన్ వేస్తున్నాడని తెలుసుకుంటుంది అట్లాస్. మరి హర్లాన్ ను అట్లాస్ ఒక్కతే ఎలా ఎదుర్కొంది? అనేది తెరపై చూడాల్సిందే.

28 ఏళ్ల క్రితం హార్లాన్ అనే AI టెర్రరిస్ట్ భూమి నుంచి గ్రహాంతర గ్రహానికి పారిపోవడం, 28 ఏళ్ల తర్వాత జెన్నిఫర్ లోపెజ్‌ని పట్టుకోవడానికి పెద్ద ఫోర్స్ తో వేరే గ్రహానికి వెళ్లడం, అక్కడ అతను ఎదుర్కొనే సమస్యలు వంటి అంశాలతో సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు