Kanguva movie story line: కంగువ సినిమా స్టోరీ లైన్ ఇదే

Kanguva movie story line: డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే హీరోలలో సూర్య ఒకరు. సూర్య ప్రస్తుతం కంగువ అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారిన శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి.

3d ఫార్మట్స్ లో కూడా

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు. సూర్య, బాబీ డియోల్ మధ్య వార్ సీన్ ను ఏకంగా 10 వేల మందితో తెరెకెక్కించినట్లు కథనాలు కూడా వినిపించాయి. సూర్య తన కెరియర్లో చేస్తున్న 42వ సినిమా ఇది. అయితే ఈ సినిమా 3d ఫార్మట్స్ లో కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇకపోతే దివాళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Suriya

- Advertisement -

కంగువ సినిమా స్టోరీ లైన్

ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ లో దేవి మార్క్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ టీజర్ కి ఒక హై ఇచ్చింది దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కెర్లు కొడుతుంది. కంగువ సినిమా అనేది 1678వ సంవత్సరంలో ఒక వ్యాధి కారణంగా మరణించిన ఒక యోధుడి కథ అన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఒక అమ్మాయి ఆ యోధుని చంపిన వ్యాధిపై పరిశోధన చేస్తుంది. అయితే కంగువ గతానికి ప్రస్తుత కాలానికి మధ్య కనెక్షన్ తో సాగే ఈ స్టోరీ లైన్. ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు చాలామంది ఆడియన్స్. గతంలో మురగదాస్ దర్శకత్వంలో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ సినిమా కూడా ఇదే మాదిరిగా అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా వర్కౌట్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో సూర్యకి గుర్తింపు లభిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు