Kiccha Sudeep: మంచి మనసు చాటుకున్న హీరో..పైగా..!

Kiccha Sudeep.. విక్రాంత్ రోణా సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. రాజమౌళి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఈగ.. ఇందులో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను అప్పట్లోనే మెప్పించిన ఈయన అటు విలన్ గా ఇటు హీరోగా తన భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు రియల్ గా కూడా ప్రజలకు సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచి మనసు చాటుకున్న సుదీప్..

Kiccha Sudeep: A hero with a good heart..more than that..!
Kiccha Sudeep: A hero with a good heart..more than that..!

వాస్తవానికి కర్ణాటకలో మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న సుదీప్ తనకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలో వచ్చిందంటే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది .. ఈ క్రమంలోనే ఈయన చేసిన ఒక పనిని మెచ్చుకుంటూ అభిమానులు ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఈయన మంచితనాన్ని మరోసారి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. తాజాగా అసలు విషయంలోకి వెళితే సుదీప్ దగ్గరికి ఒక మూగ అభిమాని వచ్చాడు.. సుదీప్, పునీత్ రాజ్ కుమార్ పెయింట్ ఉన్న ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి సుదీప్ కి బహుమతిగా ఇచ్చాడు.. తన కష్టాలు ఒక లేఖలో రాసి సుదీప్ ఇవ్వగా.. సుదీప్ అది చదివిన తర్వాత ఆ మూగ వ్యక్తి కష్టాలు తెలుసుకొని కొంత అమౌంట్ ను చెక్ రూపంలో అప్పటికప్పుడే ఇచ్చేశారు..

ఆర్థిక సహాయంతో పాటు ఆకలి తీర్చిన సుదీప్..

అంతేకాకుండా ఆ అభిమాని చాలా దూరం నుంచి వచ్చాడని తెలుసుకొని తిన్నావా అని అడిగారు కూడా
ఇక ఆ అభిమాని లేదు బయటకెళ్ళి తింటాను అని మూగ భాషతో సైగ చేయడంతో అక్కడే తన ఇంట్లో ఫుడ్ పెట్టి పంపించాడు.. ఇక తన కష్టాలు తెలుసుకొని డబ్బులు ఇవ్వడంతో.. ఆ మూగ అభిమాని సుదీప్ కాళ్ళ మీద పడి నమస్కరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. మరోసారి సుదీప్ మంచి మనసుని అటు అభిమానులు ఇటు నెటిజన్స్ అభినందిస్తున్నారు.. గతంలో కూడా పలుసేవ కార్యక్రమాలు చేసిన సుదీప్ ఇప్పుడు ఇలా మరోసారి తన మంచి మనసున్న చాటుకోవడంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

- Advertisement -

కిచ్చా సుదీప్ కెరియర్..

దక్షిణ భారతదేశానికి చెందిన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడు, నిర్మాత ,సినీ రచయిత, టీవీ వ్యాఖ్యాత కూడా.. మొదటిసారి ఈగ సినిమాతో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన కన్నడలో స్పర్శ, హుచ్చా, నంది, కిచ్చా , స్వాతిముత్తు , కెంపెగౌడ , జస్ట్ మాత్ మా తల్లి, వీరమడకరి వంటి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు హుచ్చా, నంది, స్వాతిముత్యం సినిమాలకు వరుసగా ఫిలింఫేర్ అవార్డులను కూడా ఉత్తమ నటుడు విభాగంలో సొంతం చేసుకున్నారు. అంతే కాదు 2013 నుంచి కన్నడ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే కన్నడలో ఈయన మొదటి చిత్రం హెబ్బులి.. గత ఏడాది కబ్జా సినిమాతో ప్రేక్షకులను అలరించిన కిచ్చా సుదీప్ మరే సినిమాతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు