Bhaje Vaayuvegam : వర్షాల ఎఫెక్ట్ పడ్డా.. వీకెండ్ కుమ్మేసింది..

Bhaje Vaayuvegam : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన “భజే వాయువేగం” సినిమా ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఆ మూడింటికి జనాల్లో మంచి ఆసక్తి నెలకొని ఉండగా, “భజే వాయువేగం” సినిమాకే పాజిటివ్ టాక్ వచ్చింది. యంగ్ హీరో కార్తికేయ నటించిన ఈ సినిమా ఉన్నంతలో టాక్ పరంగా చూసుకుంటే మిగతా వాటి కంటే బెటర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఓపెనింగ్స్ స్లో గా ఉన్నా డే ఎండ్ అయ్యే టైంకి పుంజుకుంటుంది అనుకున్నా, ఫస్ట్ డే ఎండ్ అయ్యే టైంకి మూడు సినిమాల్లో బెటర్ టాక్ ఉన్నా కూడా వీక్ కలెక్షన్స్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుంది. అయితే మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు అనుకోగా రెండో రోజుకి వచ్చే సరికి మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా జోరు చూపించి ఆల్ మోస్ట్ మొదటి రోజు కన్నా మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేయడం విశేషం అని చెప్పాలి. ఇక మూడో రోజు కూడా మంచి హోల్డ్ ని ఈ సినిమా చూపించడం విశేషం.

Bhaje Vaayuvegam weekend collections

వీకెండ్ కుమ్మేసిన భజే వాయువేగం..

ఇక (Bhaje VaayuVegam) సినిమా రెండో రోజు నుండి మాత్రం మంచి జోరుని చూపెడుతూ ఇప్పుడు వీకెండ్ ని స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ముగించింది. మూడో రోజు రెండో రోజు లెవల్ లో ఓపెన్ అయ్యి ఒక టైంలో డే 2 కన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా సడెన్ వర్షాల వలన ఇబ్బంది తలెత్తగా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ని చూపించి వీకెండ్ ని కంప్లీట్ చేసుకోవడంతో వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని చూపించినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదని చెప్పాలి. ఇక సినిమా వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ న గమనిస్తే.. నైజాం లో 92 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో 1.13 కోట్లు రాబట్టగా, కర్ణాటక ఓవర్సీస్ సహా మరో 34 లక్షలు వసూలు చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 2.39 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

- Advertisement -

స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తే.. ఈజీ గా బ్రేక్ ఈవెన్?

ఇక మొత్తం మీద 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన భజే వాయువేగం సినిమా 3 రోజుల వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 1.61 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల ఫలితాల కారణంగా కలెక్షన్ల పై గండి పడే ఛాన్స్ ఉందని చెప్పాలి. అలాగే వర్షాల ప్రభావం కారణంగా ఆదివారం కొంచెం తక్కువ వసూళ్లు వచ్చాయి. మరి వర్కింగ్ డే లో భజేవాయువేగం హోల్డ్ చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు