Pranitha: బాత్ రూమ్ వీడియో షేర్ చేసిన ప్రణీత.. నెటిజన్స్ ఫైర్..?

Pranitha: ప్రముఖ గ్లామర్ బ్యూటీ ప్రణీత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. టాలీవుడ్ లో బాపు బొమ్మగా పేరు సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం నెట్టింట మరోసారి ట్రెండింగ్ గా మారింది. ఏకంగా తన యానివర్సరీ సందర్భంగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెటిజెన్స్ కి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె షేర్ చేసిన వీడియోలో బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోని షేర్ చేయడంతో అటు అభిమానులు కూడా కోపం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

బాత్ టబ్ లో.అందాలను నురగతో కప్పేసిన ప్రణీత..

Pranitha: Praneetha shared bathroom video.. Netizens fire..?
Pranitha: Praneetha shared bathroom video.. Netizens fire..?

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ నానా రచ్చ చేసే ఈమె.. తన పర్సనల్ విషయాలతో పాటు భర్త, బిడ్డ గురించి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె యానివర్సరీ జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాను బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోతో పాటు.. థాయిలాండ్ లో తన భర్త నితిన్ రాజు తో డిన్నర్ డేట్ కి వెళ్లిన ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలన్నీ కూడా ఆమె సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియో షేర్ చేసింది.. అందులో తన అందాలను నురగతో కప్పేసింది.. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ ప్రణీతపై మండిపడుతున్నారు. ఇలాంటి వీడియోలు ఎందుకు షేర్ చేస్తున్నావు.. ఈ నురగలని కూడా తీసేయి అంటూ ట్రోలింగ్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే ప్రణీత షేర్ చేసిన ఈ వీడియో పై అభిమానులు పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

ప్రణీత కెరియర్..

ఇక ప్రణీత విషయానికి వస్తే.. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ బాపు గారి బొమ్మ ప్రణీత.. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగులో రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, ఏం పిల్లో ఏం పిల్లడో, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. కరోనా సమయంలో కూడా పేదల కోసం తన వంతు సహాయం చేసి తనపై మరింత గౌరవాన్ని పెంచుకుంది.. అనంతరం సినిమా ఆఫర్లు కాస్త తగ్గడంతో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు ను వివాహం చేసుకొని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తాజాగా తన పెళ్లిరోజు సందర్భంగా తన భర్తతో కలిసి థాయిలాండ్ కి వెళ్లిన ఈమె అక్కడ ఇలా బాత్ టబ్ వీడియోని షేర్ చేయడంతో కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రణీత షేర్ చేసిన వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు