Pawan Kalyan.. గత రెండు మూడు నెలలుగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎదురుచూపుకు నేటితో బ్రేక్ పడనుంది.. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొనగా.. మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలియబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం అటు వైసిపి ఇటు టిడిపి శ్రేణుల్లో కూడా బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుస్తారు అంటూ చాలా సర్వేలు వెల్లడించాయి.
ఇక పవన్ కళ్యాణ్ గెలుపు అనివార్యమయింది.. కాబట్టి ముందుగానే సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు..ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ బొనాంజా ప్రకటించింది చిత్ర బృందం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకపక్క భారీ చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ నటించిన చిత్రాలలో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ (OG) కూడా ఒకటి.. మరి ఈ చిత్రం నుంచి ఈరోజు మేకర్స్ ఒక క్రేజీ పోస్టర్ ను వదలనున్నారని ఒక స్ట్రాంగ్ వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని చాలామంది నమ్ముతున్నారు.. అలా మేకర్స్ గెలుపుతో ఫాన్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా ఇప్పుడు సరికొత్త పోస్టర్ ని దింపుతున్నట్లు సమాచారం ..మరి అసలు కథ ఏమవుతుందో తెలియాలి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం కచ్చితంగా ఓజీ నుంచి పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు డబుల్ బొనాంజా ఇవ్వడం ఇవ్వాలని అనుకుంటున్నారు మరి ఏ మేరకు ఫలితాలు వెలబడునున్నాయి పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనే విషయాలు తెలియాలి అంటే మరి కొంతసేపు ఆగాల్సిందే.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత బద్రి , జానీ వంటి సినిమాలతో మరింత పేరు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ తన సినిమాలలో నటించడం కాదు.. అప్పుడప్పుడు కొరియోగ్రాఫర్ గా , డైరెక్టర్ గా కూడా మారి తన సినిమాలను తెరకేక్కించడం జరిగింది. గబ్బర్ సింగ్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పిస్తూ వచ్చాడు . ఇక తర్వాత జనసేన పార్టీని స్థాపించి.. 2019 ఎన్నికల్లో పోటీ చేయగా ఓడిపోయారు.. ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి పిఠాపురంలో ఆయన గెలిచారా లేదా తెలియాలి అంటే మరి కొంచెం సేపు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలలో నటిస్తున్నారు అయితే ప్రస్తుతం ఎన్నికల కారణంగా ఈ సమావేశం పవన్ కళ్యాణ్ ఫలితాలు వెలువడిన వెంటనే సినిమా షూటింగ్లలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఫలితాలు పవన్ కళ్యాణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.