Ranbir Kapoor : రణబీర్, అలియా గ్యారేజ్ లోకి కొత్త కారు… దాని ధర ఎంతంటే

Ranbir Kapoor : బాలీవుడ్ పవర్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ కొత్త లగ్జరీ కారు కొన్నారు. ఈ జంట కొన్న కారు ధర ఎంతో తెలుసా?

రణబీర్ కొత్త కారు ధర ఎంతంటే?

బాలీవుడ్ సెలబ్రిటీ జంట రణబీర్ కపూర్, అలియా భట్‌లకు కార్లంటే పిచ్చి. ఇప్పటికే ఈ స్టార్ కపుల్ గ్యారేజీలో చాలా ఖరీదైన కార్లు ఉండగా, తాజాగా మరో కొత్త కారు కొన్నారు. రీసెంట్ గా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఈ జంట ఇటలీ వెళ్లారు. తాజాగా భారత్‌కు తిరిగొచ్చారు. ముంబై విమానాశ్రయంలో రణబీర్ కపూర్, అలియా భట్ లను ఇంటికి తీసుకెళ్లాడానికి ఎంపీవీ వాహనం వచ్చింది. MPV అంటే మల్టీ పర్పస్ వెహికల్. ఈ కారులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. తమ బిడ్డతో డ్రైవింగ్ చేయడం కోసం రణబీర్ దంపతులు ప్రత్యేకంగా ఈ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ లగ్జరీ లెక్సస్ ఎల్ఎమ్ కారు ఆన్-రోడ్ ధర రూ. 2.5 కోట్లు.

లెక్సస్ ఎల్ఎమ్ కారు ఫీచర్స్

Lexus LM అనేది 7 సీటర్ కారు. ఈ కారులో చాలా స్పేస్ ఉంటుంది. కావలసినంత బూట్ స్పేస్‌తో 4 సీటర్ ను సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. రణబీర్, అలియాల వద్ద ఇప్పటికే బెంట్లీ జిటి వి8 (రూ. 6 కోట్లు), లూసిడ్ సఫైర్ (రూ. 5.2 కోట్లు), రేంజ్ రోవర్ సహా అనేక కార్లు ఉన్నాయి.

- Advertisement -

రణబీర్ కపూర్-ఆలియా భట్ ఇంటికి విలాసవంతమైన లెక్సస్ కారు వచ్చింది

ఈ ఏడాది కొత్త ఇంట్లో దీపావళి

ఈ సంవత్సరం ప్రారంభంలో రణబీర్, అలియా తమ కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. పాలి హిల్‌లోని విలాసవంతమైన కృష్ణ రాజ్ బంగ్లాను రీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. త్వరలో అలియా, రణబీర్ కొత్త ఇంటికి మారనున్నారు. మూడేళ్లుగా పునర్నిర్మాణంలో ఉన్న ఈ బంగ్లా దాదాపు సిద్ధమైందని సమాచారం. ఈ జంట ఈ సంవత్సరం దీపావళిని వారి కొత్త ఇంట్లో జరుపుకుంటారు. ఈ ఇంటి పనులు పూర్తవుతాయని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు రణబీర్రు, అలియా. ఎట్టకేలకు తమ కూతురు రాహాతో కలిసి ఈ దీపావళిని కొత్త ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారన్న మాట.

ఆ బంగ్లా ధర

రణబీర్ కపూర్ ప్రస్తుతం కడుతున్న విలాసవంతమైన బంగ్లాకు తన కూతురు పేరును పెట్టబోతున్నాడు అని వార్తలు విన్పిస్తున్నాయి. ‘రాహా’ అని పేరు పెట్టనున్నారు. బంగ్లా ధర 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

నటి అలియా భట్, రణబీర్ కపూర్ చాలా సంవత్సరాల డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ జంట వివాహం 2022లో జరిగింది. పెళ్ళయిన 7 నెలల తర్వాత అలియా రాహాకు జన్మనిచ్చింది. కపూర్ కుటుంబం ముద్దుల కూతురు రాహా ముఖాన్ని క్రిస్మస్ సందర్భంగా వెల్లడించారు.

రణబీర్ సినిమాలు

యానిమల్ భారీ విజయం తర్వాత రణబీర్ కపూర్ తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రామాయణం సినిమాలో కనిపించనున్నాడు. అలాగే ‘లవ్ అండ్ వార్’, ‘యానిమల్ పార్క్’ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలియా భట్ కొత్త చిత్రం ‘జిగ్రా’ను ఇటీవల ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు