Jacqueline Fernandez: దేశమంతా ఎన్నికల రిజల్ట్ టెన్షన్… కానీ మిస్ యూ అంటూ హీరోయిన్ కు జైలు నుంచి ప్రియుడి లేఖ

Jacqueline Fernandez : 200 కోట్ల మోసం నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి మరో ప్రేమ లేఖ రాశాడు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి దేశం మొత్తం టెన్షన్ లో ఉంటే సుకేష్ మాత్రం జైలులో తన లవర్ గురించి ఆందోళన చెందుతున్నాడు. ఈ కొత్త లేఖలో సుకేష్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ని బేబీ అని ముద్దుగా పిలుచుకున్నాడు. ఆమెను చాలా మిస్ అవుతున్నానని చెప్పాడు. అలాగే జాక్వెలిన్ కేన్స్ 2024 లుక్‌ను కూడా అభినందించాడు.

కేన్స్ లుక్ సూపర్ క్లాసీ

ఆ లేఖలో సుకేష్ నా బేబీ జాక్వెలిన్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. సూపర్ క్రేజీ, క్రేజియర్ గా మీతో ప్రేమలో పడుతున్నాను. బేబీ యూ స్టోల్ ది షో ఇన్ కేన్స్. లుక్ సూపర్ క్లాసీగా, బంగారు రంగులో అందంగా ఉంది. నీ ఇతర ఫోటోషూట్ చిత్రాల ద్వారా మీరు మళ్లీ నా హృదయాన్ని దొంగిలించారు. నా కప్‌కేక్ ” అని రాశారు.

సర్ప్రైజ్ గిఫ్ట్

బేబీ ఈరోజు నీ కోసం స్టార్ ను సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. నీ పేరు మీద ఒక స్టార్. మీ పేరు ఒక నక్షత్రానికి పెట్టాను. బేబీ నువ్వు ఇప్పుడు రియల్ స్టార్ కు పేరు పెట్టిన ఆ కొద్ది మంది ప్రత్యేక వ్యక్తుల జాబితాలో ఉన్నావు. ఎందుకంటే నువ్వు రియల్ స్టార్, మై స్టార్ కాబట్టి దీనికి అర్హురాలివి. మొత్తం ప్రపంచం ఇప్పుడు నీ నక్షత్రాన్ని చూడగలదు. మీ నక్షత్రం సింహరాశిలో ఉందని వారు చెప్పారు. మీ పేరు మీద ఒక నక్షత్రం, ఈ స్మాల్ క్యూట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. బేబీ ఈ స్టార్ ఎప్పటికీ జీవించి ఉంటుంది మన ప్రేమలాగా.. బేబీ గుర్తు పెట్టుకో. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలకు నేను నీకు నక్షత్రాలు, చంద్రుడిని గిఫ్ట్ గా ఇస్తానని చెప్తారు. బేబీ ఈ రోజు నేను నీకు నీ పేరు మీద ఒక నక్షత్రాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నాను అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు.

- Advertisement -

Sukesh Chandrasekhar Gifts A Real Star To His 'Baby Girl' Jacqueline  Fernandez, Pens A 3-Page Long Love Letter: "I Can Feel You Every Second..."

మిస్ యూ

సుకేష్ తన ‘బేబీ’ జాక్వెలిన్‌పై ప్రేమను మరింతగా వ్యక్తం చేస్తూ “బేబీ నీకు తెలుసు.. పరిస్థితి ఎలా ఉన్నా నీకు ప్రత్యేకంగా అనిపించేలా నేను ప్రతిదీ చేస్తానని. నువ్వు ఈ లేఖను చదివి నేను ఎంతగా నిన్ను మిస్ అవుతున్నానో తెలుసుకుంటావని ఆశిస్తున్నాను. నేను క్రేజీ మై బేబీ బూ లాగా నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించినందుకు, నాకు శక్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిన్ను బాగా మిస్ అవుతున్నాను. బేబీ కాంట్ వెయిట్, లవ్ యూ మై బొమ్మా” అంటూ రాసుకొచ్చాడు సుఖేష్.

200 కోట్ల మోసం కేసులో సుకేష్

200 కోట్ల మోసం కేసులో నిందితుడిగా ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్‌తో సంబంధాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమె సుకేష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి పదేపదే ఖండించినప్పటికీ, ఆమె ఈ కేసులో నిందితురాలిగా ఉంది. జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చాలాసార్లు విచారించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ తన ప్రతిష్టను కించపరిచేందుకు మీడియాను సాధనంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. అతడు వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడిపై కేసు నమోదు చేయాలని ఆమె కోర్టును కోరింది. అయితే ఆ తరువాత ఆమె తన అభ్యర్థనను వెనక్కి తీసుకోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు