Pawan Kalyan: మిస్టర్ బచ్చన్ సెట్ లో పవన్ కళ్యాణ్ విజయం పై సంబరాలు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించే దిశగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 58 స్థానాలలో విజయం సాధించగా 76 స్థానాలలో లీడింగ్ లో ఉంది. అటు జనసేన పార్టీ.. 8 స్థానాల్లో విజయం సాధించి 13 స్థానాలలో లీడింగ్ లో ఉంది. బిజెపి పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించగా ఐదు స్థానాలలో లీడింగ్ సంపాదించుకుంది.

Celebrations for Pawan Kalyan’s success on the set of Mr Bachchan

ఈ లెక్కలు పరిశీలిస్తే సాయంత్రం వరకు తెలుగుదేశం కూటమి 160 స్థానాలను దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇటు పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్… పడి లేచిన కెరటం లాగా దూసుకు వచ్చాడు అయితే పవన్ కళ్యాణ్ విజయం సాధించిన నేపథ్యంలో… రెండు తెలుగు రాష్ట్రాలలో సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

అయితే తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ సెట్ లో…. పవన్ కళ్యాణ్ విజయం పై సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో దర్శకుడు హరీష్ శంకర్ పాల్గొనడం జరిగింది. ఈ సినిమాలోని నటులు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాంబులు పేల్చి మరి… ఎంజాయ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు