Pawan Kalyan: పిఠాపురం లో భారీ మెజారిటీతో పవన్ గెలుపు.. వెళ్లిపోకే శ్యామల అంటూ ట్వీట్ చేసిన నిర్మాత..!

Pawan Kalyan: ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. 70 వేలకు పైగా మెజారిటీతో ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల ప్రచారంలో యాంకర్ శ్యామల వైసిపి తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఆమె ఓ సెలబ్రిటీ అయి ఉండి.. పవన్ కళ్యాణ్ పై గాటు వ్యాఖ్యలు చేసింది. పవన్ ఎన్నికలలో విజయం సాధించలేడు అంటూ అవమానించింది. అయితే ప్రస్తుతం పవన్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

Pawan's victory in Pithapuram with a huge majority
Pawan’s victory in Pithapuram with a huge majority

దాదాపు కూటమిదే విజయం అవుతుందనే విధంగా ఫలితాలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలో బేబీ చిత్ర నిర్మాత ఎస్ కే ఎన్ యాంకర్ శ్యామల కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ..ఆ చిత్రంలో వెళ్లిపోకే శ్యామల.. ఏమి బాగా లేదే అంటూ పాటను షేర్ చేశారు. జనసేన విజయం సందర్భంగా ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు