HBD Priyamani : 40 ఏళ్ల ఈ బిజీ హీరోయిన్ ఎన్ని కోట్లు వెనకేసిందో తెలుసా?

HBD Priyamani : నాలుగు పదుల వయసులో కూడా ప్రియమణి తన గ్లామర్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను కూడా పోషిస్తూ ఆల్ రౌండర్ గా అదరగొడుతోంది. ఈరోజు ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజుతో ప్రియమణి 40వ పడిలోకి అడుగు పెడుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ బ్యూటీ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రియమణి గురించి, ఆమె ఇన్నేళ్లు సినిమాలు చేసి కూడబెట్టిన ఆస్తుల గురించి తెలుసుకుందాం.

ప్రియమణి ఆస్తులు ఎన్ని కోట్లు అంటే?

ప్రియమణి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి దక్షిణ భారత భాషలలో మాత్రమే కాకుండా హిందీలో కూడా నటించింది. ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌కు భారీ స్పందన రావడంతో హిందీలో సినిమా అవకాశాలు వచ్చాయి. గతేడాది అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ జవాన్‌లో ప్రియమణి కూడా ప్రధాన పాత్ర పోషించింది.

కాగా ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్‌ని పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తున్న ప్రియమణికి ఇప్పుడు 40 ఏళ్లు. మరి ఇన్నేళ్ళు సినిమాలలో నటించిన ప్రియమణి ఎన్ని కోట్లు వెనకేసుకుంది అంటే.. కోట్లాది ఆస్తులకు ఆమె యజమాని. ప్రియమణి ఆస్తి విలువ రూ.60 కోట్లకు పైగా ఉంటుందని, ఒక్కో సినిమాకు ఆమె రూ.2 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రియమణికి హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి నగరాల్లో విలాసవంతమైన బంగ్లాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

Priyamani on working with Mohanlal in Neru: 'I was a bit intimidated  because…' | Malayalam News - The Indian Express

ప్రియమణి అసలు పేరేంటో తెలుసా?

వసుదేవ మణి అయ్యర్, లతా మణి అయ్యర్ దంపతులకు జన్మించింది ప్రియమణి. ఆమె పూర్తి పేరు ప్రియా వసుదేవ మనీ అయ్యర్. సినిమాల్లోకి వచ్చాక తన పేరును షార్ట్ గా ప్రియమణి అని మార్చుకుంది. విద్యాభ్యాసం మొత్తం కేరళలోనే పూర్తి చేసిన ప్రియమణి బిఎ చదివాక మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. 2003లో ఈ బ్యూటీ ఎవరే అతగాడు అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అయితే ఫస్ట్ మూవీ నిరాశపరచడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.

ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె చేసిన యమదొంగ మూవీ భారీ హిట్ కావడంతో ప్రియమణికి స్టార్ హీరోయిన్ గా పేరు వచ్చింది. ఇక ద్రోణ సినిమాలో బికినీలో అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ప్రియమణి కెరీర్ ఊహించనంత ఫాస్ట్ గా డల్ అయిపోయింది. కానీ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఈ బ్యూటీ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. రీసెంట్ గా భామాకలాపం అనే లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది ప్రియమణి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు