Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ విజయం…మెగా హీరోల సంచలన పోస్ట్ !

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత పై దాదాపు 70 వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక అలాగే భీమవరం నియోజకవర్గాలలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్… రెండు చోట్ల ఓడిపోయారు.

అయితే ఈసారి… పిఠాపురంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెండా ఎగరవేశారు. ఈ గెలుపుతో మొట్టమొదటిసారిగా…. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలో… జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా… మెగా హీరో సాయి ధరమ్ తేజ్… కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. చెప్పాడు చేశాడు… మనల్ని ఎవర్రా ఆపేది సాయి ధరంతేజ్ పోస్ట్ పెట్టాడు.

ఇక అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ‘సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్దత ఎలప్పుడూ తన హృదయాన్ని హత్తుకున్నాయి. ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు