Raju Yadav OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గెటప్ శ్రీను మూవీ.. డేట్ అండ్ ప్లాట్ ఫామ్ ఇదే..!

Raju Yadav OTT: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తాజాగా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు కమెడియన్ గా ఉన్న ఈ నటుడు ప్రజెంట్ హీరోగా కూడా మారాడు. రాజు యాదవ్ మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు గెటప్ శ్రీను. ఇక ఈ చిత్రం ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.

ఇంట్రెస్టింగ్ పాయింట్తో రావడంతో ఈ మూవీపై క్రేజ్ ఏర్పడింది. అయితే థియేటర్లలో అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఇక తాజాగా ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Getup Srinu movie coming to OTT
Getup Srinu movie coming to OTT

ఈ చిత్రం జూన్ 22వ తేదీన ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం జూన్ 22నే స్ట్రీమింగ్ కి వస్తుందో లేదో చూడాలి. అమెజాన్ ప్రైమ్ తాజాగా విడుదల చేస్తున్నా సినిమాలన్నిటిని చాలా సైలెంట్ గా ఓటీటీ లో వదిలేస్తుంది. అలా ఈ సినిమాని కూడా రెండో కంటికి తెలియకుండా తమ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు