Pawan Kalyan: విజయకేతనం.. ట్వీట్ల వర్షం కురిపిస్తున్న సెలబ్రిటీస్..!

Pawan Kalyan.. 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరు ఏ విధంగా కొనసాగిందో అందరికీ తెలిసిందే… ముఖ్యంగా నువ్వా నేనా అంటూ అటు వైసిపి ఇటు కూటమి పోటీపడ్డారు. ఇక మొత్తానికైతే ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడ్డాయి.. ఇక తాజాగా కూటమిలో భాగంగా జనసేన 21 స్థానాల్లో 21 స్థానాలు విజయాన్ని దక్కించుకొని.. నూటికి నూరు శాతం విజయం సాధించి పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. అంతే కాదు చరిత్రలో ఇప్పటివరకు ఎవరు ఈ రేంజ్ లో వందకు వంద శాతం గెలుపొందలేదని చెప్పడంలో సందేహం లేదు. మొదటిసారి ఒక సినీ సెలబ్రిటీ ఈ రేంజ్ లో ప్రజల నమ్మకాన్ని పొంది వందకు వందశాతం విజయాన్ని దక్కించుకోవడం నిజంగా ఒక ప్రభంజనమే అని చెప్పవచ్చు.

అఖండ మెజారిటీతో పవన్ విజయం..

Pawan Kalyan: Vijayketan.. Celebrities showering tweets..!
Pawan Kalyan: Vijayketan.. Celebrities showering tweets..!

ఈ నేపథ్యంలోనే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేసి ఏకంగా 70,298 ఓట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు.. ఇక ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు ట్విట్టర్ ద్వారా తమ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఎక్స్ ద్వారా కంగ్రాట్స్ చెబుతూ పలువురు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు కూడా ట్వీట్ చేస్తున్నారు.

నితిన్:

- Advertisement -

హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెబుతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో విజయం సాధించిన మీ చరిత్ర.. మీరు కూటమిని అగ్రస్థానానికి చేర్చిన తీరుపట్ల ఒక అభిమానిగా మరియు సోదరుడిగా నేను చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నాను.. ఎంతో సంతోషిస్తాను. భావోద్వేగాలు ఆక్రమిస్తున్నందున.. నా ఆనందాన్ని చెప్పలేను కానీ ఒక అద్భుతమైన ఘట్టం మీది అంటూ నితిన్ తెలిపారు.

సాయి ధరమ్ తేజ్:

సాయి ధరంతేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అలాగే భవిష్యత్తులో సేఫ్ హాండ్స్ లో ఉండబోతోంది అంటూ ట్వీట్ చేశారు.

డివివి దానయ్య:

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మాణ సంస్థ డివిడి ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ఖాతా నుంచి నెత్తురుకి మరిగిన చిరుత అంటూ ట్వీట్ చేశారు.

ఎస్కేఎన్:

వ్యూహం నాకు వదిలేయండి పవన్ కళ్యాణ్ గారు.. ఇది ఆయన స్థాయి అంటూ పవన్ కళ్యాణ్ పోస్టర్ తో ట్వీట్ చేశారు.

ఇక ఇలా చాలామంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాజాగా కొద్దిసేపటి క్రితం.. ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గెలుపునిచ్చి అతి పెద్ద బాధ్యతను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాపై వేశారు.. కచ్చితంగా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతాను అంటూ వాగ్దానం చేశారు..మరి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎటువంటి న్యాయం చేకూరుస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు