Ram Charan : బాబాయ్ పై అబ్బాయ్.. మా కుటుంబానికి గర్వకారణమైన రోజు..! అంటూ..

Ram Charan : తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది ఎన్నికల పోరు ఎలా జరిగిందో తెలిసిందే. తెలంగాణాలో ఎంపీ ఎన్నికలు అయితే, ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు కూడా జరగగా, ఈసారి ఏకంగా 88 శాతం పోలింగ్ నమోదయింది. ఇక ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు (జూన్ 4) వెలువడ్డాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పలితాలు, మరియు పార్లమెంట్ లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి చెరో 8 ఎంపీ సీట్లు దక్కించుకోగా, మరొకటి ఎంఐఎం కి వచ్చింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అనూహ్యాంగా టిడిపి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించగా, కూటమిలో భాగంగా జనసేన ఏకంగా పోటీచేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు కూడా గెలిచి భారీ విజయాన్ని దక్కించుకొని.. నూటికి నూరు శాతం విజయం సాధించి పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతే కాదు చరిత్రలో ఇప్పటివరకు ఎవరు ఈ రేంజ్ లో వందకు వంద శాతం గెలుపొందలేదని చెప్పడంలో సందేహం లేదు. ఇక మొదటిసారి ఒక సినీ సెలబ్రిటీ ఈ రేంజ్ లో ప్రజల నమ్మకాన్ని పొంది ఘన విజయాన్ని దక్కించుకోవడం నిజంగా ఒక ప్రభంజనమే అని చెప్పవచ్చు.

Ram charan Special wish to Pawan kalyan

సెలెబ్రిటీల స్పెషల్ విషెస్…

ఇక పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత సినీ సెలెబ్రిటీలు సంతోషం తో పవన్ కళ్యాణ్ కి స్పెషల్ విషెస్ అందచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేసి ఏకంగా 70,298 ఓట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. హీరో నితిన్, నిర్మాత డివివి దానయ్య, ఎస్కేఎన్, హీరో రవితేజ, రామ్ పోతినేని, కార్తికేయ, సందీప్ కిషన్, తమిళ నటులు ఎస్. జె సూర్య, ఆది పినిశెట్టి, రాధికా శరత్ కుమార్, ఖుష్బూ సుందర్, అలాగే కాజల్ అగర్వాల్ ఇలా ఎంతో మంది నటీనటులు టెక్నిషియన్స్ పవన్ కళ్యాణ్ కి విషెస్ అందచేస్తున్నారు.

- Advertisement -

బాబాయ్ కోసం అబ్బాయ్..

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపు పై మెగా ఫ్యామిలీ కూడా ప్రశంసల వర్షం కురిమించారు. పవన్ కళ్యాణ్ పై అన్న చిరంజీవి తన బెస్ట్ విషెస్ అందచేశారు. అలాగే అల్లు అర్జున్ కూడా ట్వీట్ వేయడం విశేషం. ఇక సాయి ధరమ్ తేజ్ అందరికంటే ముందు విష్ చేసి, పవన్ ఇంటికి కూడా వెళ్ళాడు. వరుణ్ తేజ్ కూడా విష్ చేయగా, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా బాబాయ్ కోసం ట్వీట్ వేసాడు. రామ్ చరణ్ తాజాగా పవన్ కళ్యాణ్ కి స్పెషల్ విషెస్ చెప్తూ, ఇది మా కుటుంబానికి గర్వకారణం అంటూ… అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు అంటూ ట్వీట్ వేశారు. ఇక జనసేన తరపున పిఠాపురానికి చివరి రోజు తన వంతు మద్దతుగా రామ్ చరణ్ వెళ్లి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు