Shruti Hassan: బ్లాక్‌ డ్రెస్‌ లో రెచ్చిపోయిన శృతి

ShrutiHassan : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారు ఉన్నారు. మరికొందరేమో వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, మహేష్ బాబుతో శ్రీమంతుడు వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఆ తర్వాత బాలయ్య, ప్రభాస్‌ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన సినిమాలకన్నా ఎక్కువగా ఎఫైర్స్ విషయంలోనే తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

వరుస సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్న సమయంలోనే శృతిహాసన్ మైకేల్ కోసలే అనే వ్యక్తితో ప్రేమలో ఉండి డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వీరు వివాహం చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు 2019లో బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత ముంబైకి చెందిన డూడల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతిహాసన్ మరోసారి ప్రేమలో పడి అతనితో డేటింగ్ లో ఉందని పలు రకాల వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ ఎప్పుడు బయటకు వెళ్లడం, ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలు, వీడియోలను మనం చాలానే చూసాం.

- Advertisement -
Shruti Hassan

ఇక ఏమైందో తెలియదు అతనికి కూడా ఈమధ్య శృతిహాసన్ దూరంగా ఉంటుందట. ఇక ఇది ఇలా ఉండగా శృతిహాసన్ తరచూ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలో ఈ భామ చాలా అందంగా, ముద్దుగా, కుందనపు బొమ్మలా ఉందని తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు