Kajal Agarwal: పెళ్లైన హీరోయిన్లను అసలు పట్టించుకోవడంలేదు !

Kajal Agarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కొనసాగుతున్నారు. పెళ్లి జరిగిన సరే… హీరోయిన్ కాజల్ అగర్వాల్… చిత్ర పరిశ్రమలో క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. చందమామ మాతో పాపులర్ అయిన.. కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మగధీర సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. రామ్ చరణ్ తో మగధీర సినిమా చేసిన తర్వాత… హీరోయిన్ కాజల్ అగర్వాల్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది.

ఇది ఇలా ఉండగా… టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్… దక్షిణ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్… ఈ సందర్భంగా మాట్లాడుతూ… పెళ్లయిన హీరోయిన్లను ఎవరు పట్టించుకోవడంలేదని ఆమె మండిపడ్డారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో… పెళ్లయినా కూడా… హీరోయిన్లకు మంచి క్రేజ్ ఉంటుందని ఆమె తెలిపారు. వాళ్లకు పిల్లలు ఉన్నా సరే… సినిమాలలో అవకాశాలు వస్తాయని వివరించారు.

Kajal Agarwal

అదే దక్షిణ ఇండస్ట్రీలో…. పెళ్లయిన హీరోయిన్లను పక్కన పెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అలియా భట్, ఐశ్వర్యారాయ్, దీపిక లాంటి హీరోయిన్లకు అవకాశాలు వస్తున్నాయని… కానీ దక్షిణ పరిశ్రమలో మాత్రం ఆ పరిస్థితి లేదని ఆమె తెలిపారు. కానీ హీరోయిన్ నయనతార కు మాత్రం మంచి అవకాశాలు రావడం శుభ పరిణామమని కాజల్ అగర్వాల్ తెలిపారు. దీంతో కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు