Maharaja OTT Platform: విజయ్ సేతుపతి మూవీ ఓటిటీ డీల్ సెట్… మహరాజా రైట్స్ ఈ ఓటిటి చేతికే?

Maharaja OTT Platform : అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకునే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ మహారాజా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి, అంచనాలను అమాంతం పెంచేసింది. మహారాజా మూవీ విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ చిత్రం కావడంతో అందరి చూపు ఇప్పుడు ఈ మూవీ పైనే ఉంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న మహారాజా మూవీకి సంబంధించిన ఓటిటి డీల్ కూడా కంప్లీట్ అయినట్టుగా సమాచారం. మరి మహారాజా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఏ ఓటిటి సొంతం చేసుకుంది? అనే విషయంలోకి వెళ్తే…

దిగ్గజ ప్లాట్ఫామ్ చేతికి మహారాజా

మహారాజా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను చిత్రం బృందం రిలీజ్ చేసింది. దీని ద్వారానే మహారాజా ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయం లీక్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో మూవీ స్ట్రీమింగ్ అవుతుందన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ పోస్టర్లో నెట్ ఫ్లిక్స్ ఉండడంతో అసలు విషయం తెలిసిపోయింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే మహారాజా మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించిన సమాచారం ఇంకా తెలియ రాలేదు.

Vijay Sethupathi's New Movie in 2024: Maharaja Release Date Revealed

- Advertisement -

థియేటర్లలో ఎప్పుడంటే?

కాగా మహారాజా మూవీ జూన్ 14న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. తమిళంలో రూపొందిన ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మహారాజా మూవీ తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. కానీ తెలుగు రిలీజ్ డేట్ గురించి ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో టాలీవుడ్ లో ఉన్న విజయ్ సేతుపతి అభిమానులు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయినట్టుగానే తెలుగులో కూడా జూన్ 14 నే థియేటర్లలోకి రాబోతోందా అనే విషయం తెలియాలంటే వెయిట్ అండ్ సి.

ఇక ట్రైలర్ల లో విజయ్ సేతుపతి గతంలో ఎన్నడూ లేని విధంగా మోస్ట్ వైలెంట్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, భారతి రాజా, సింగం పులి, అరుణ్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహారాజ మూవీకి నితిలన్ స్వామినాథన్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై జగదీష్ పళని స్వామి, సుధన్ సుందరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అజనీష్ లోకనాథ్ మహారాజ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు