Venom The Last Dance Trailer : హాలీవుడ్ స్టార్ టామ్ హార్డీ కథానాయకుడిగా నటించిన ‘వెనమ్ 3’ చిత్రం నుంచి గూస్ బంప్స్ తెప్పించే ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను గంట వ్యవధిలో యూట్యూబ్‌లో 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. మరి ఆ ట్రైలర్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
అంచనాలు పెంచేసిన ట్రైలర్
హాలీవుడ్లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో టామ్ హార్డీ సూపర్ హీరో చిత్రం ‘వెనమ్’ కూడా ఒకటి. ఏఎ ఫ్రాంచైజీలో గతంలో వచ్చిన ‘వెనమ్ 2’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ‘వెనమ్ 3’ విడుదలకు ముందు సోనీ పిక్చర్స్ ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేసి అంచనాలు పెంచేసింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
వెనమ్ 3 ట్రైలర్ విశేషాలు
‘వెనమ్’ మూడో భాగం ‘వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. గతంలో కంటే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ని ఎక్కువగా ఉపయోగించారు అనే విషయం ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. ప్రేక్షకులను మంచి సినిమాటిక్ ఫీలింగ్ ను కలిగించడానికి మేకర్స్ ఈసారి విఎఫ్ఎక్స్ అదిరిపోయే మ్యాజిక్ ను క్రియేట్ చేస్తున్నారు. అలాగే గ్రహాంతర వాసులతో వెనమ్ పోరాటం సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. హై ఆక్టెన్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ ను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ట్రైలర్ లో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే వెనమ్ ఓ గుర్రం శరరంలోకి ప్రవేశించాక అది పరిగెత్తే సన్నివేశం.
ఇదే లాస్ట్ పార్ట్
మీడియా కథనాల ప్రకారం సోనీ పిక్చర్స్ ఛైర్మన్ టామ్ రోత్మాన్ ఒక ఇంటర్వ్యూలో టామ్ హార్డీ సూపర్ హీరో చిత్రం ‘వెనమ్ – ది లాస్ట్ డ్యాన్స్’ (వెనమ్ 3) ఈ ఫ్రాంచైజీకి చివరి చిత్రం అని వెల్లడించారు. ఈ చిత్రానికి కెల్లీ మార్షల్ దర్శకత్వం వహించారు. సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్‌లో ఇది ఐదవ చిత్రం. ‘వెనమ్’ తొలిసారి 2018లో విడుదలైంది. దీని తర్వాత ఈ చిత్రం రెండవ భాగం ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ 2021లో విడుదలైంది. ఇప్పుడు దాని మూడవ భాగం ‘వెనమ్ 3’ (వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్) అక్టోబర్ లో విడుదల కానుంది. దీని మూడో భాగాన్ని గతేడాది ప్రకటించారు. ఈ చిత్రంలో టామ్ హార్డీ, చివెటెల్ ఎజియోఫోర్, జూనో టెంపుల్, రైస్ ఇఫాన్స్, పెగ్గి లు, అలనా ఉబాచ్, స్టీఫెన్ గ్రాహం నటించారు. మార్షల్, హార్డీ కలిసి ఈ చిత్రానికి కథను రాశారు. వెనమ్ 3ని అవి అరద్, మాట్ టోల్మాచ్, అమీ పాస్కల్, హచ్ పార్కర్ నిర్మిస్తున్నారు.
వెనమ్ 3 థియేటర్లలోకి ఎప్పుడంటే?
‘వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్’ IMAX, PLFSలలో విడుదల అవుతుంది. వెనమ్ 3 అక్టోబర్ 25న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కొత్త ట్రైలర్ యూట్యూబ్ తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది.