Chandrika Ravi : అమెరికన్ షోను హోస్ట్ చేసిన మొట్ట మొదటి భారతీయ నటి… చరిత్ర సృష్టించిన బాలయ్య హీరోయిన్

Chandrika Ravi : అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు ఇప్పటికే హాలీవుడ్ లో అదరగొడుతున్న విషయం తెల్సిందే. తాజాగా భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి మరో సరికొత్త చరిత్రను క్రియేట్ చేశారు. త్వరలో ఒక అమెరికన్ టాక్ షోను ఆమె హోస్ట్ చేయనున్నారు. మరి ఈ టాక్ షో విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

అమెరికన్ షోకు హోస్ట్ గా మొట్టమొదటి భారతీయ మహిళ

చంద్రిక త్వరలో అమెరికన్ టాక్ షోకి హోస్ట్ గా కనిపించనుంది. ఆమె ‘ది చంద్రికా రవి షో’ అనే అమెరికన్ టాక్ షోను హోస్ట్ చేస్తుంది. ఈ షోలో ఆమె తన అనుభవాలు, కష్టాలను పంచుకోవడం వంటివి చూసే అవకాశం దక్కుతుంది. ఈ బ్యూటీ నటిగా తనదైన ముద్ర వేయడానికి చాలా కష్టపడింది. ఆమె పోరాట స్ఫూర్తిఐ చూసి ఇంప్రెస్ అయిన రక్కస్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు స్యామీ చంద్ చంద్రికకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. షోలో తన అనుభవం గురించి చంద్రిక మాట్లాడుతూ “ఇది చాలా గొప్ప అనుభవం. కానీ కొంచెం ఒత్తిడితో కూడుకున్నది. నా ఇన్నేళ్ల నటనతో పోలిస్తే కెమెరా వెనుక ఉండటం కొత్త అనుభవం. ప్రజలు నన్ను నా నిజ రూపంలో చూడగలరు” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ‘ది చంద్రికా రవి షో’ షోతో అమెరికా రేడియో షోకి హోస్ట్‌గా వ్యవహరించిన తొలి భారతీయ మహిళగా చంద్రిక రికార్డును క్రియేట్ చేసింది.

Nandamuri Balakrishna movie actress Chandrika Ravi bacame first Indian actress to host a US radio show

- Advertisement -

హోస్ట్ మాత్రమే కాదు నిర్మాత కూడా

ఈ షోకి సంబంధించిన ప్రతి అంశంలోనూ చంద్రిక బాగా ఇన్వాల్వ్ అయింది. చంద్రిక మాట్లాడుతూ “గత కొన్నేళ్లుగా నేను నా స్వంత టాక్ షో గురించి పని చేస్తున్నాను. చాలా కాలంగా దానికి జీవం పోయాలని ప్రయత్నించాను. ఇప్పుడు నేను ఎట్టకేలకు విజయం సాధించాను” అని చెప్పింది. చంద్రిక ఈ షోకి కేవలం హోస్ట్ మాత్రమే కాదు కో-ప్రొడ్యూసర్ కూడా. ఈ కార్యక్రమం అమెరికా అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన iHeart రేడియోలో ప్రసారం కానుంది.

యూట్యూబ్‌లో కూడా..

అమెరికాలో రేడియో షోను హోస్ట్ చేయడం గురించి చంద్రిక మాట్లాడుతూ “ఏఎ పని చేస్తున్న మొదటి వ్యక్తిని నేనే కావచ్చు. కానీ నేను చివరిదానిని మాత్రం కాను. ఈ షోను ప్రపంచంతో పంచుకోవడానికి నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎవరో వ్యక్తీకరించడానికి, నన్ను ఉపయోగించుకోవడానికి ఇదొక వేదిక, వాయిస్. ఇది నాకు బహుమతి లాంటిది” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చంద్రిక రవి షో ప్రతి గురువారం ఉదయం 7:30 IST కి iHeart రేడియో, రక్కస్ అవెన్యూ రేడియోలో ప్రసారం అవుతుంది. దీని పూర్తి ఎపిసోడ్ ప్రతి శుక్రవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారని సమాచారం.

చంద్రిక రవి సినిమాలు

చంద్రిక రవి భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి. ఆమె తమిళం, తెలుగు, ఇంగ్షీషు చిత్రాలలో నటించింది. ‘ఇరుట్టు అరైలే మురట్టు కూతు’లో కీలక పాత్ర, నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లో మా బావ మనోభావాలు సాంగ్ లో మెరిసింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు