Rashmika mandhana: ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి అటువంటి కండిషన్స్ పెట్టిన నేషనల్ క్రష్.. మరి ఓవర్ అయ్యింది గా…!

Rashmika mandhana: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒకానొక సమయంలో స్టార్ హీరోలు హీరోయిన్స్ కి కండిషన్స్ పెట్టేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ నే స్టార్ హీరోలకి కండిషన్స్ పెడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాప్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న కొందరు హీరోయిన్స్ పాన్ ఇండియా లెవెల్ లో ఉండే హీరోలకి కూడా కండిషన్స్ పెడుతూ డైరెక్టర్స్ కి షాక్ ఇస్తున్నారు.

ఇక తాజాగా ఇటువంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం వార్ 2 షెడ్యూల్లో పాల్గొనున్నారు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

Rashmika Mandanna de-glam look, Rashmika Mandanna Pushpa 2, Rashmika Mandanna viral news
Rashmika Mandanna de-glam look, Rashmika Mandanna Pushpa 2, Rashmika Mandanna viral news

అందుకు ఈ ముద్దుగుమ్మ కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందట. ఈ చిత్రంలో డి గ్లామరస్ లుక్ లో కనిపించను అంటూ తగేసి చెప్పిందట. ఆల్రెడీ పుష్ప, పుష్ప 2 లో బ్యాక్ టు బ్యాక్ డి గ్లామరస్ లుక్ లో కనిపించింది. మళ్లీ అలాగే కనిపిస్తే జనాలకి బోర్ కొడుతుందని చెప్పిందట రష్మిక. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఏకంగా 7 కోట్లు డిమాండ్ చేస్తుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు