OTT Movie : చావడానికే వెళ్ళే మాయా అడవిలో ఒంటరి అమ్మాయి పోరాటం… బయట పడిందా?

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. హారర్ తో పాటు మెదడుకు పదును పెట్టే సస్పెన్స్ అనగానే అందరికీ ఆసక్తి రెట్టింపు అవుతుంది. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీని ఈరోజు సజెషన్ లో తెలుసుకోబోతున్నాం. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ ఓ మాయ అడవి, అందులో తప్పిపోయిన తన ట్వీన్ సిస్టర్ ను వెతుక్కుంటూ వెళ్లే అమ్మాయి గురించి ఉంటుంది. ఎమోషన్స్ ను బట్టి రకరకాల మాయల్ని క్రియేట్ చేసే అడవిలో ఆ అమ్మాయి తన సోదరిని ఎలా కనిపెట్టింది అని ఇంట్రెస్టింగ్ మూవీ పేరు ది ఫారెస్ట్. ఈ అమెరికన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ అవుతోంది.

Movie Review: THE FOREST (2016) Horror – Matthew Toffolo's Summary

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటి ?

ది ఫారెస్ట్ మూవీ స్టోరీ ఏంటంటే సారా, జస్ అనే ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఉంటారు. అందులో జస్ అనే అమ్మాయి స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తుంది. ఆ స్కూల్ కి సంబంధించిన క్యాంప్ లో భాగంగా దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్ కు వెళ్తుంది జస్. కానీ ఆ తర్వాత దారి తప్పి స్కూల్ కు తిరిగి చేరుకోలేక పోతుంది. నిజానికి ఆ పర్వతం దగ్గరకు సూసైడ్ చేసుకునే వాళ్ళు వెళ్లాలి అనుకుంటారు. అయితే జస్ తప్పిపోయింది అన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె కోసం వెతికి, ఫలితం లేకవపవడంతో ఆ ఫారెస్ట్ లో చనిపోయి ఉండొచ్చు అని జస్ ట్విన్ సిస్టర్ అయిన సారాకు చెప్తారు. అయితే తారా మాత్రం వాళ్ళు చెప్పిన విషయాన్ని అస్సలు ఒప్పుకోదు. తను బతికే ఉందన్న బలమైన నమ్మకంతో తన సిస్టర్ ను వెతకడానికి బయలుదేరుతుంది.

ఆ తర్వాత స్కూల్ నుంచి మొదలుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ప్రిన్సిపల్ అదొక భయంకరమైన ఫారెస్ట్ అంటూ గతంలో జరిగిన స్టోరీని సారాకు చెప్తుంది. అలాగే సారా ఈ కేసులో భాగంగా ఐడెన్ అనే అమెరికన్ జర్నలిస్ట్ ని కలుసుకుంటుంది. ఇద్దరు ఫాస్ట్ గానె ఫ్రెండ్స్ అవుతారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు చనిపోవడం గురించి చెబుతుంది సారా. అలాగే తాను జస్ ను వెతకడానికి అడవిలోకి వెళ్లాలి అనుకుంటున్నాను అనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ స్థానికులు మాత్రం బాధగా ఆ అడవిలో అడుగు పెట్టే వాళ్లను అది లేని మాయలు ఉన్నట్టుగా చూపించి ఆడుకుంటుంది అని హెచ్చరిస్తారు. అయినప్పటికీ సారా అక్కడికి వెళ్తుంది. మరి ఆ తర్వాత ఈ ఒంటరి అమ్మాయి పోరాటం ఎలా ముగిసింది? తన సోదరిని కనిపెట్టిందా? లేదంటే అడవి చేసే మాయకు బలైపోయిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ ఫారెస్ట్ మూవీ ని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు