Kajal About Acharya : ఆచార్య మూవీని నా మైండ్ నుంచి డిలీట్ చేశా !

Kajal About Acharya : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీని గత 15 సంవత్సరాలుగా ఏలుతోంది కాజల్. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో… టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. చందమామ సినిమా బంపర్ హిట్ కావడంతో… టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఈ బ్యూటీకి ఛాన్సులు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమాలో… మిత్ర బింద పాత్ర చేసి అందరిని మెప్పించింది కాజల్ అగర్వాల్. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. గణేష్, ఆర్య 2, బృందావనం అలాగే డార్లింగ్ లాంటి ఎన్నో సినిమాలు చేసి వరుస హిట్లు అందుకుంది కాజల్ అగర్వాల్. అయితే కాజల్ అగర్వాల్ కెరీర్ లో.. ఆచార్య సినిమా ఎప్పటికీ గుర్తుండి పోతూ ఉంటుంది.

Kajal Agarwal: Kajal Aggarwal walked out of 'Acharya' on her..
రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి హీరోలుగా… ఆచార్య సినిమా తెరకుఎక్కిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తీశారు. మావోయిస్టు బ్యాక్గ్రౌండ్, గ్రానైట్ తవ్వకాలు, ఓ చిన్న గ్రామ సమస్య వీటన్నింటినీ బేస్ చేసుకుని ఒక కొత్త కథను… కొరటాల శివ తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడింది.

- Advertisement -

వాస్తవానికి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను అనుకున్నారట. ఈ మేరకు కొంత భాగం షూటింగ్ కూడా చేశారట. అయితే చివరి క్షణంలో… ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకోవడం జరిగింది. చిత్ర బృందం పక్కకు పెట్టిందా ? లేక ఆమెనే సినిమా నుంచి తప్పకుందా? తెలియదు కానీ అప్పట్లో ఈ విషయం పెద్ద కాంట్రవర్సీ అయింది.

అయితే ఫైనల్ గా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించారు. అయితే రెండు సంవత్సరాల కిందట వచ్చిన ఈ సినిమా… అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే తన పాత్ర లేకపోవడంపై తాజాగా కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆచార్య సినిమా గురించి తాను ఎప్పుడో మర్చిపోయాను అని బాంబు పేల్చారు. ఆచార్య మూవీని నా మైండ్ నుంచి డిలీట్ చేశా… అంటూ కాజల్ షాకింగ్ కామెంట్ చేశారు. అంతేకాదు.. పెళ్లిళ్లు అయిన హీరోయిన్స్ ను.. సౌత్ ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా పట్ల కాజల్ అగర్వాల్ చాలా అసంతృప్తిగా ఉన్నారని… ఆ కామెంట్స్ విన్న నెటిజెన్స్ రెస్పాండ్ అవుతున్నారు. చిరంజీవిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు