Ravali: ఇండస్ట్రీలో రెండో పెళ్లిపై హాట్ కామెంట్స్ చేసిన రవళి తల్లి..!

Ravali.. టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ రవళి.. తన అందంతో, అభినయంతో అందరిని ఆకట్టుకుంది.. ముఖ్యంగా బుల్లితెర నటిగా పేరుపొందిన హరిత ఈమెకు చెల్లెలు అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.. రవళి హీరోయిన్ గా వెండితెర పైన సక్సెస్ అయితే .. హరిత బుల్లితెర మీద సక్సెస్ అయ్యింది అని చెప్పవచ్చు. కానీ హరిత రవళిని ఇండస్ట్రీకి పంపించేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని.. తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది వాటి గురించి చూద్దాం.

కూతుర్లు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన రవళి తల్లి..

Ravali: Ravali's mother made hot comments on the second marriage in the industry..!
Ravali: Ravali’s mother made hot comments on the second marriage in the industry..!

ముఖ్యంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న శ్రీదేవి లాంటి పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా.. అప్పటికే వివాహం అయిన వ్యక్తులకు రెండో భార్యగా వెళ్ళారు. అయితే అప్పట్లో ఇది చాలా ట్రెండీగా మారిపోయిందని తెలియజేసింది. ఈ విషయాలు తెలుసుకున్న రవళి తల్లి.. తమ కూతుర్లను సైతం హెచ్చరించిందట.. ఇలాంటి పనులు చేస్తే అసలు ఇంటిలోకి కూడా రానివ్వనని.. కాళ్లు, చేతులు విరగ్గొడతానంటూ వార్నింగ్ ఇచ్చారట. సినిమాలలో నటిస్తే నటి అవ్వండి లేకపోతే ఇంట్లోనే కూర్చోండి అంటూ చెప్పానంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవళి తల్లి వెల్లడించింది. ముఖ్యంగా తన కుటుంబంలో కూడా ఇలాంటివి ఎక్కడ చోటు చేసుకోలేదని హీరోయిన్ రవళి తల్లి వెల్లడించింది.

వివాహమైన వారికి రెండో భార్యగా.. అప్పట్లో అదే ట్రెండ్..

అప్పట్లో హీరోయిన్ శ్రీదేవి భోణీ కపూర్ ను ప్రేమించి వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా అప్పటికే బోణీ కపూర్ కు పిల్లలు కూడా ఉన్నారని.. అయినప్పటికీ శ్రీదేవి పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారని తెలిపింది. అలాగే మరొక హీరోయిన్ హేమమాలిని కూడా మిథున్ చక్రవర్తికి రెండో భార్యగా వెళ్ళింది. అప్పట్లో ఒక స్టార్ హీరో తో ఈమెకు మ్యారేజ్ అరేంజ్ చేస్తామని చెప్పినా కూడా వినకుండా.. అతడిని సినిమా స్టైల్ లో ప్రేమించి మరీ వివాహం చేసుకుంది అంటూ రవళి తల్లి వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ నటుడు మిథున్ చక్రవర్తి మాత్రం హేమా మాలినితో కాకుండా తన మొదటి భార్య తోనే ఉండడంతో ఈమె సింగిల్ గానే ఉండిపోయింది.

- Advertisement -

కూతుర్ల విషయంలో జాగ్రత్తలు..

ఇలా తన కూతుర్లు ఇండస్ట్రీలో ఇబ్బందులు పడకూడదు అని.. ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి వారిని పెద్దవారిని చేసాను అంటూ రవళి తల్లి తెలియజేసింది. కానీ అప్పట్లో రెండో పెళ్లి వివాహం అనేది సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది అంటూ రవళి తల్లి వెల్లడించింది. ఇక రవళి విషయానికి వస్తే ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ మరొకవైపు బుల్లితెర క్వీన్ గా పేరు సంపాదించుకుంది హరిత.. ఇలా వీరి తల్లి వీరి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంది కాబట్టే వీరు ఎప్పటికీ ఎవర్గ్రీన్ గాని నిలిచిపోయారు. ఎప్పటికీ రూమర్స్ కి తావు ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు