Sharwanand: ఇక అన్ని మంచి రోజులే….!

Sharwanand: కొంతకాలం పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీని గురించి చాలామంది సినిమా ప్రముఖులు కూడా మాట్లాడారు. అయినా లాభం లేకపోలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల పరంగా అటు రాజకీయపరంగా కీలకమైన పాత్రను పోషించారు. అయితే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకప్పుడు తన సినిమాలను అడ్డుకోవడం, తన సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లను తగ్గించడం. ఇలాంటి చాలా పనులను చేసింది. పవన్ కళ్యాణ్ వీటిని బహిరంగంగా కూడా ఖండించాడు.

మెగా అభిమానులను బాధించిన విషయం

ఇకపోతే ఆ మధ్యకాలంలో సినిమా టిక్కెట్ రేట్లు కూడా చాలా తక్కువగా కనిపించేవి. తెలుగు సినిమా పరిశ్రమ అంచలంచలుగా ముందుకు వెళుతూ తెలుగు సినిమాని వేరే స్థాయిలో నిలబెడుతున్న తరుణంలో సినిమా యొక్క స్థితిగతులను తగ్గించే ప్రయత్నం చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భారీ బడ్జెట్ సినిమాలకు కూడా తక్కువ రేట్లను పెట్టి టార్గెట్ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి చాలామంది స్టార్ హీరోలను తన వెంటబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి టిక్కెట్ రేట్లు గురించి సినిమా పరిశ్రమ గురించి కొంచెం ఆలోచించండి అంటూ చేతులెత్తి నమస్కారం కూడా చేశారు. అయితే ఇది చాలామంది మెగా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది.

Kalki 2898 AD

- Advertisement -

మంచి రోజులు వచ్చాయి

ఎట్టకేలకు సినిమా పరిశ్రమకు న్యాయం చేస్తామని మాటిస్తూ సినిమా టిక్కెట్ రేట్లు కూడా ఒక రకంగా ఒక మాదిరిగా పెంచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇకపోతే ప్రతి ఒక్కరికి ఒక టైం నడుస్తుంది అని చెప్పినట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక టైం వచ్చింది. పవన్ కళ్యాణ్ పార్టీ తరపున పోటీ చేసిన 21 అభ్యర్థులు కూడా తమదైన స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ కూడా మంచి రోజులు వస్తాయని అందరూ నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మనమే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శర్వానంద్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ మనమే సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత జూన్ 27న కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది, ఇక పైన అన్ని మంచి రోజులే అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు