Klinkara Trending : ఫ్యామిలీ లో ది రియల్ గేమ్ చేంజర్..

Klinkara Trending : గత ఏడెనిమిది నెలల కాలంగా మెగా ఫ్యామిలీకి అన్ని కలిసి వస్తున్నాయి. ఈ ఫ్యామిలీ లో అన్ని స్పెషల్ గా నిలుస్తున్నాయ్. తలపెట్టిన ప్రతి కార్యం సక్సెస్ అవుతుంది. చిరంజీవి మొదలుకొని ఫ్యామిలీ లో ప్రతిఒక్కరికి శుభాలే జరుగుతున్నాయి. దీనికంతటికి కారణం మెగా వారసురాలే అని నెట్టింట ట్రెండ్ అవుతుంది. అవును.. కొణిదెల ఫ్యామిలీ ఇంట కొణెదల క్లిన్ కారా (Klinkara Trending) ఏ స‌మ‌యాన అడుగుపెట్టిందో కానీ, ఆ కుటుంబానికి అన్నీ క‌లిసొస్తున్నాయ్. గత కొన్నాళ్లుగా దేనిలోనూ అప‌జ‌యం అన్న‌దే లేదు. మెగా ఫ్యామిలీ అప్ర‌తిహ‌త‌ జైత్ర యాత్ర కొన‌సాగిస్తోంది. వ‌రుస‌గా మెగా హీరోలు అరుదైన విజ‌యాల‌ను సాధిస్తూ, గొప్ప గౌర‌వాన్ని అందుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా అంద‌రికీ క్లిన్ కారా ఛామ్ క‌లిసొస్తోంది.

Klinkara became a lucky charm for megafamily success

పద్మవిభూషణుడిగా చిరు నుండి MLA పవన్ కళ్యాణ్ దాకా..

ఇక మెగా ఫ్యామిలీ ఇంట రామ్ చరణ్ ఉపాసన ముద్దుల తనయగా మెగా వారసురాలిగా
క్లిన్ కారా అడుగుపెట్టిన‌ వేళా విశేష‌మో ఏమో కానీ.. ఇంత‌కుముందు చిరంజీవిని ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించింది. కేంద్రంలోని భాజ‌పా-ఎన్డీయే ప్ర‌భుత్వం .. న‌టుడిగా, మాన‌వ‌తావాదిగా చిరు అసాధార‌ణ ట్రాక్ రికార్డును, ప్ర‌జా సేవ‌ల‌ను గుర్తించి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారంతో గౌర‌వించుకుంది. చిన్నారి క్లిన్ కారా త‌మ‌ న‌ట్టింట అడుగుపెట్ట‌గానే రామ్ చ‌ర‌ణ్ ఆనందంలో ఎంత‌గానో పుల‌కించిపోయాడు. ఇక రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో త‌న అద్భుత న‌ట‌న‌, డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకోగా, అందులో `నాటు నాటు..` పాట‌కు ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ పుర‌స్కారం ద‌క్కింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారంతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారం ద‌క్కింది. అన్నిటికి మించి రామ్ చరణ్ ఇంటర్నేషనల్ రేంజ్ లో తన స్థాయిని పెంచుకున్నాడు. ఇక క్లిన్ కారా (Klinkara Trending) త‌మ కుటుంబానికి ల‌క్కీ ఛామ్ గా మార‌డంతో చ‌ర‌ణ్ రెట్టించిన ఉత్సాహంతో క‌నిపిస్తున్నాడు.

- Advertisement -

నేడు పవన్ కళ్యాణ్ కి కూడా..

ఇక అలాగే మెగా ఫ్యామిలి లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా కలిసొచ్చింది. ఇక లేటెస్ట్ గా జ‌న‌సేనాని కొణెదల ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అఖండ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అవుతున్నారు. త‌న పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల‌ను జ‌న‌సేనాని గెలిపించుకున్నారు. ఈ వ‌రుస విజ‌యాల‌ను గ‌మ‌నిస్తే ఇదంతా క్లిన్ కారా వ‌ల్ల క‌లిసొచ్చిన అదృష్టం అని మెగాభిమానులు భావిస్తున్నారు. క్లిన్ కారా ఆ ఇంట అడుగుపెట్ట‌గానే అన్ని విఘ్నాలు తొల‌గిపోయాయని భావించ‌వ‌చ్చు. అందుకే మెగా కాంపౌండ్ లో రియ‌ల్ గేమ్ ఛేంజ‌ర్ ఎవ‌రు? అంటే చ‌ర‌ణ్ కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. క్లిన్ కారా.. అని మెగాభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. మరి వాటన్నిటికీ కూడా క్లింకార లక్ కలిసొస్తుందేమో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు