Sriram Aditya: పవన్ కళ్యాణ్ గారు పండగ వాతావరణం తీసుకొచ్చారు

Sriram Aditya: కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. కొన్నిసార్లు ఊహించినవి కూడా జరగొచ్చు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయంగా కూడా తమ స్టామినా ఏంటో చూపించారు. 2014లో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ కి మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. వాటిని అంచలంచలుగా అధిగమిస్తూ వచ్చాడు.
2019లో తీవ్ర పరాజయాన్ని పొందుకున్నాడు. 2024లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు.

Pawan Kalyan

ఐదేళ్లలో ఎన్నో కష్టాలు

పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డాడో చాలామందికి తెలిసిందా. చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎవరికి సంబంధం లేని వారితో ఎన్నో మాటలు అనిపించుకున్నాడు. నా విజయం ఊరికే వచ్చింది కాదు. ఆ విజయం వెనుక పదేళ్ల కష్టం ఉంది. దాదాపు పవన్ పరాజయం తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు. తన సినిమాలను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తన సినిమాలకు టిక్కెట్లను కూడా తగ్గించారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఆ సమస్య లేదు. దాదాపు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ ఒక కొలిక్కి రానున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇదే విషయాన్ని చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఒప్పుకుంటున్నారు.

- Advertisement -

పండగ వాతావరణం

శర్వానంద్ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా మనమే అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన చాలామంది పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జర్నీ చూసి చాలా నేర్చుకోవాలని ఉంది చెప్పుకొచ్చారు. మొదట పవన్ కళ్యాణ్ పండగ వాతావరణం సృష్టించారు. ఈ పండగ ఎలాగ కొనసాగుతూనే ఉంటుంది అంటూ మాట్లాడారు శ్రీరామ్ ఆదిత్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు