Rockstar: రీ రిలీజ్ సినిమాకి కోట్లు కలెక్షన్లు

Rockstar: రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరో రన్బీర్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది రణబీర్ సినిమాలు చూసి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా అనిమల్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు రన్బీర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ.

వైలెంట్ ఫిలిం అంటే ఏంటో చూపిస్తాను

అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ అని పేరుతో రీమేక్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాను అక్కడ రీమేక్ గా చేసినప్పుడు చాలామంది సందీప్ ని టార్గెట్ చేశారు ఆ సినిమాకి చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు. కానీ ఆడియన్స్ మాత్రం ఆ సినిమాకి దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు అందించారు. అయితే ఆ సినిమాను వైలెంట్ ఫిలిం అనిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై అప్పట్లో సందీప్ స్పందిస్తూ అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను మీకు చూపిస్తాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Ranbir Kapoor

- Advertisement -

పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ వచ్చింది

ఇకపోతే యానిమల్ సినిమాతో అందరికీ సమాధానమిచ్చాడు సందీప్. అరాచకానికి అసలైన అర్థం చూపించాడు. ఒక లవర్ బాయ్ ఉన్న రన్బీర్ కపూర్ ని ఇలా కూడా చూపించొచ్చు అని కంప్లీట్ వైలెంట్ ఫిలిం ను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన విజయాన్ని సాధించింది. దాదాపుగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇక్కడితో పాన్ ఇండియా రేంజ్ లో రన్బీర్ కపూర్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.

రాక్ స్టార్ కలెక్షన్లు

అనిమల్ సినిమాతో అన్ని భాషల్లో గుర్తింపు సాధించుకున్నాడు రన్బీర్. ఇకపోతే రీసెంట్గా రణబీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ మూవీ రిలీస్ చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తుంది.ఈ సినిమాని 175 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. దీనికి 2 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పుడు మిస్ అయ్యిన వారు ఈ సినిమాని మళ్ళీ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు