Thammudu ReRelease : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ బూస్టప్ రెడీ..!

Thammudu ReRelease : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని పదేళ్లుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. జనసేనాని గా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ తో గెలుపొందిన విషయం తెలిసిందే. జూన్ 4 న ఎన్నికల ఫలితాలు వెలువడగా ఆల్మోస్ట్ ఫలితాలకు ముందే పవన్ కళ్యాణ్ తో పాటు ట్రేడ్ విశ్లేషకులు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో పిఠాపురం నియోజకవర్గం నుండి ఏకంగా డెబ్భైవేల కి పైగా మెజార్టీ తో గెలుపొందారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలుపొందడం విశేషం. ఇలా పవన్ కళ్యాణ్ వంద శాతం సక్సెస్ స్ట్రైక్ రేట్ తో గెలుపొందుతాడని ఎవరూ ఊహించలేదు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపుకు మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు ప్రతి ఒక్కరూ స్పెషల్ గా విష్ చేసారు. ఇక మెగాభిమానుల ఆనందానికైతే అవధుల్లేవు. పవన్ కళ్యాణ్ గెలుపు ప్రకటించిన క్షణం నుండి మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పుడు ఆ ఆనందాన్ని రెట్టింపు చేసే కొస మెరుపు లాంటి క్రేజీ అప్డేట్ వచ్చింది.

Pawan Kalyan Thammudu Re Releasing on June 15

ఫ్యాన్స్ స్పెషల్ తమ్ముడు రీ రిలీజ్..

ఇక పవన్ పవన్ కళ్యాణ్ గెలుపుకి స్పెషల్ బూస్టప్ ఇస్తూ మెగాభిమానులకు కిక్కించే అప్డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “తమ్ముడు” (Thammudu ReRelease) సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్. కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా స్టార్ డమ్ తెచ్చి పెట్టిన సినిమా తమ్ముడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఆ సినిమాలో ప్రీతీ జింగ్యానీ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాను అరుణ్ ప్రసాద్ డైరెక్ట్ చేయగా, బూర్గుల పల్లి శివరామకృష్ణ నిర్మించారు. రమణ గోగుల మ్యూజిక్ అందించిన ఈ సినిమా 1999 జులై 15న విడుదలై ఘన విజయం సాధించింది. అప్పటివరకు చిరంజీవి తమ్ముడిగా పిలవబడిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇక తాజాగా తమ్ముడు సినిమా రిలీజ్ అయి త్వరలో పాతికేళ్లు (25 years) అవుతున్న సందర్బంగా సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

ఫ్యాన్స్ కి స్పెషల్ బూస్టప్..

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండి తన సినిమాలను పెండింగ్ లో పెట్టగా, పవన్ కళ్యాణ్ నుండి రావాల్సిన సినిమాలు రాలేక ఫ్యాన్స్ కూడా సినిమాల పరంగా కాస్త డీలా పడ్డారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలుపొందగా, అభిమానుల్లో సూపర్ జోష్ వచ్చింది. ఇప్పుడు ఆ జోష్ ని రెట్టింపు చేసేలా స్పెషల్ బూస్టప్ ఇస్తూ తమ్ముడు రీ రిలీజ్ అవుతుంది. జూన్ 15న తమ్ముడు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రీ రిలీజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి స్పెషల్ బూస్టప్ లా కొత్త ఎనర్జీ ని ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ “ఓజి” రిలీజ్ ఖచ్చితంగా అవుతుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు