South Movies 2024 : ఈ నెల నుండి అగ్ర తారలు, దర్శకుల పెద్ద సినిమాల విడుదలలతో 2024 ద్వితీయార్థం బాక్స్ ఆఫీసును షేక్ చేయడానికి రెడీగా ఉంది. ప్రభాస్, ధనుష్, విక్రమ్ వంటి టాప్ స్టార్లు భారీ అంచనాల చిత్రాలతో థియేటర్లలో రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి జూన్‌లో థియేటర్లలోకి వచ్చే సౌత్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏంటో చూద్దాం.
1. సత్యభామ
బిడ్డ పుట్టాక కాస్త విరామం తర్వాత కాజల్ అగర్వాల్ రీఎంట్రీకి రెడీగా ఉంది. కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2తో కాజల్ తెరపైకి తిరిగి రావాలని అనుకున్నారు. కానీ భారతీయుడు 2 విడుదలను జూలై 12కి మార్చారు. దీంతో ఆమె నటించిన 60వ చిత్రం సత్యభామ జూన్ 7న రిలీజ్ అవుతోంది. సత్యభామ చిత్రానికి రచయిత-దర్శకుడు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు.
2. రాయన్
పా పాండి తర్వాత ధనుష్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన మూవీ రాయన్. ఈ చిత్రానికి ఆయన దర్శకుడు మాత్రమే కాదు హీరోగా కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి తదితరులు నటించారు. రాయన్‌ను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు. జూన్ 13న రాయన్ విడుదల కానుంది.
3. డబుల్ ఇస్మార్ట్
డబుల్ ఇస్మార్ట్ అనేది 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీలో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ పాత్రను మరోసారి పోషించనున్నారు. ఇందులో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జూన్ 14న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది.
4. తంగలాన్
పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ మూవీ కోలార్ గనులకు సంబంధించిన చారిత్రక కథాంశంతో రూపొందింది. తమిళంలో భారీ అంచనాలున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించారు. జియో స్టూడియోస్, స్టూడియో గ్రీన్ మరియు నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన తంగలాన్ లో మాళవిక మోహనన్ కథానాయికగా నటించారు. తాజా సమాచారం ప్రకారం తంగలాన్ జూన్‌లో విడుదల కానుంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన లేదు.
5. కల్కి 2898 ఏడీ
జాతీయ అవార్డు పొందిన మహానటి చిత్రాన్ని రూపొందించిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని కీలకపాత్రలు పోషించారు.
6. మహారాజా
విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ జూన్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతిరాజా, అభిరామి, మమతా మోహన్ దాస్ తదితరులు నటించారు.