Churuli OTT.. ఈ మధ్యకాలంలో చాలామంది థియేటర్లకు వెళ్లకుండా టీవీలోనే ప్రత్యేకించి ఓటీటీలలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ముఖ్యంగా బయట థియేటర్ కు వెళ్లి ఆ ఖర్చులు భరించలేక అందులో సగం ఖర్చుతోనే కుటుంబం మొత్తం సినిమా వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.. అందుకే ఇప్పుడు ఓటీటీలకు హవా భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జానర్లలో సినిమాలను విడుదల చేస్తూ ఆకట్టుకుంటున్నారు.. ఇక తాజాగా సస్పెన్స్ ,థ్రిల్లర్, హార్రర్ కాన్సెప్ట్‌లకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
సస్పెన్స్ థ్రిల్లర్ గా చురులి..
ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో విపరీతంగా ఆకట్టుకుంది.. ట్విస్ట్ లతో ఆడియన్స్ మతిపోతుంది.. మలయాళం లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా దూసుకుపోతోంది.. ప్రస్తుత కాలంలో మలయాళ మూవీల హవా ఎక్కువగా నడుస్తోంది.. ఏ ఛానల్ చూసినా సరే థ్రిల్లర్ ట్విస్ట్ లతో కూడిన జానర్ల విభాగంలోకి వెళ్తే ఎక్కువగా మలయాళ సినిమాలే ఉండడం గమనార్హం. ఇప్పుడు ఓటీటీ లో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలలో చురులి కూడా ఒకటి. ఇటీవలే ఓటీటీ లోకి వచ్చేసింది ఈ సినిమా..
ఓటీటీ లోకి వచ్చేసిన చురులి..
లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో అందుబాటులో ఉంది. చురులి సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. ఇందులో చంబన్ వినోద్ జోస్ , వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్, జాఫర్ ఇడుక్కి , గీతి సంగీత, సౌబిన్ షాహిర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
చురులి కథ ఏమిటంటే..
సినిమా కథ ఏమిటంటే జాయ్ ( సౌబిన్ షాహిర్) అనే నేరస్తులను పట్టుకునేందుకు ఆంటోనీ, షాజీవన్ పేర్లు మార్చుకొని దట్టమైన అడవి మధ్యలో ఉండే చురులి అనే గ్రామంలోకి వెళ్తారు. ఇద్దరూ అండర్ కవర్ పోలీసులుగా ఆ గ్రామంలోకి వెళ్తారు.. అక్కడ తంకన్ అనే వ్యక్తి కి చెందిన రబ్బర్ తోటలో గుంతలు తవ్వడానికి వచ్చిన కూలీలుగా తమను పరిచయం చేసుకుంటారు.. ఆ సమయంలో తంకన్ ఊరిలో లేకపోవడంతో ఆ ఇద్దరినీ కల్లు దుకాణం యజమాని పనిలో పెట్టుకుంటాడు. జాయ్ ఎవరో తెలుసుకొని పట్టుకునేందుకు కళ్ళు దుకాణంలో చేరిన ఆంటోనీ, షాజీవన్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడున్న గ్రామస్తులు వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? రాత్రి పడుకున్న తర్వాత షాజీవన్ కు వచ్చే కలలు ఏమిటి ?వాటి అర్థం ఏమిటి? షాజీవన్ కే ఏలియన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? చివరికి జాయ్ ను పోలీసులు పట్టుకున్నారా ? అసలు ఎవరా జాయ్? అతను చేసిన నేరాలు ఏంటి? ఇలా క్షణక్షణం ట్విస్ట్ లతో ఊహించని సంఘటనలతో సాగే ఈ సినిమా అదిరిపోయిందని చెప్పాలి.. ముఖ్యంగా అనుక్షణం ట్విస్ట్ లు కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి థ్రిల్ ను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు.