Priyanka: అదితి రావు ని మించిపోయిన బిగ్బాస్ పింకీ.. అసూయపడే గ్లామర్ తో మిని ఒంపులు..!

Priyanka: హిరామండిలో అదితీరావు గజగామిని వాక్ సూపర్ పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. కేన్స్ ‌ లోను ఆ నడకతో వయారాలు పోతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ వాక్ ను బిగ్ బాస్ పింకీ ట్రై చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిపై హీరోయిన్ అనుపమ స్పందిస్తూ.. దేవత అని పొగిడింది.

తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా వావ్ అన్నారు. ఇక ఆమె టాలెంట్ కు ఫిదా అయ్యారు. సిరి ఇచ్చిన ఐడియాను ఫాలో అయ్యానని చెప్పిన పింకీ.. అందరూ పాజిటివ్గా స్పందించినందుకు థాంక్స్ కూడా తెలియజేసింది. కాగా ప్రేక్షకులు కూడా ఫస్ట్ టైం ఆమె పోస్టుకు సానుకూలంగా స్పందించారు. అసలు ఇంతా అందం ఇండస్ట్రీకి కనిపించడం లేదా అంటూ డైరెక్టర్స్ ని ప్రశ్నిస్తున్నారు.

ఇక హీరోయిన్గా ఆమెకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటుందని దర్శక నిర్మాతలకు సూచిస్తున్నారు. సంజయ్ లీల భన్సాలి తనను ఇలా చూస్తే తప్పక హిరామండి సీక్వెల్లో అవకాశం ఇస్తాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు