OTT Movie : కేర్ టేకర్ ను మోహించే దెయ్యం బొమ్మ… బాయ్ ఫ్రెండ్ ఎంట్రీతో మైండ్ నే బెండ్ చేసే ట్విస్ట్

OTT Movie : మోహం అనేది అమ్మాయిలకు మాత్రమే కాదు దెయ్యాలకు కూడా ఉంటుందనే విషయాన్ని ఇప్పటి దాకా మనం ఎన్నో సినిమాలో చూసాము. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా ఓ బొమ్మకి కేర్ టేకర్ పై మోహం కలుగుతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఎంట్రీతో పిచ్చెక్కించే ట్విస్ట్ వస్తుంది. మరి ఇంతకీ హారర్, సస్పెన్స్ కలగలిసిన ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి అనే విషయంపై లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పకుంటున్న మూవీ పేరు ది బాయ్. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సీక్వెల్స్ కూడా తెరపైకి వచ్చాయి. కానీ ఫస్ట్ పార్ట్ కు వచ్చినంత రెస్పాన్స్ మిగతా సినిమాలకు రాలేదని చెప్పాలి. ఈ బొమ్మ దయ్యం మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

The Boy: EW Review

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే

అమెరికాలో ఉండే గ్రెటా అనే అమ్మాయికి కేర్ టేకర్ గా ఇంగ్లాండ్ లో ఉద్యోగం దొరుకుతుంది. ఊరికి దూరంగా ఉన్న పెద్ద బిల్డింగ్ లో కేర్ టేకర్ గా జాబ్ రావడంతో గ్రెటా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఇంట్లో ఇద్దరు ముసలి దంపతులు జీవిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి తమ కొడుకును చూసుకోవడానికి కేర్ టేకర్ గా గ్రెటాను అపాయింట్ చేసుకుంటారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక బొమ్మను చూపించి వాడే తమ బాబు అని చెప్పి, అతన్ని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలని గ్రెటాకు వివరిస్తారు. ఇదంతా తెలిసి ముందుగా నవ్విన గ్రెటా ఆ తర్వాత వాళ్ల ఇష్టం మేరకు అతని బాగా చూసుకుంటానని చెప్తుంది. ఇక కొడుకుని చూసుకోవడానికి రూల్స్ కూడా పెడతారు. ఇవన్నీ చెప్పాక నెక్స్ట్ డే ట్రిప్ అని చెప్పి వెళ్లి, ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు.

ఇక ఆ బొమ్మతో పాటు ఒంటరిగా ఉన్న గ్రెటా ఆ తర్వాత అక్కడ జరిగే వింత పరిస్థితులను గమనిస్తుంది. పడుకున్నప్పుడు వింత శబ్దాలు రావడంతో పాటు పీడకలలు కూడా వస్తాయి. అయితే అదే సమయంలో మాల్కమ్ అనే వ్యక్తి పరిచయమై ఆ బొమ్మ స్టోరీని చెప్తాడు. ఇక ఈ వింత సంఘటనలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఆ బొమ్మను ప్రేమగా చూసుకోవాలని డిసైడ్ అవుతుంది గ్రెటా. ఆ బొమ్మలో ఆత్మ ఉందనే విషయాన్ని మాల్కమ్ కి ప్రూవ్ చేసి చూపిస్తుంది. దీంతో అతను భయపడి పారిపోతాడు. అయితే అంతా తెలిసినప్పటికీ ఆ బొమ్మ తనను ఏం చేయదు అని గట్టి నమ్మకంతో ఉంటుంది గ్రెటా. కానీ అనుకోకుండా ఓ రోజు గ్రెటా మాజీ ప్రియుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చి గొడవపడతాడు. ఆ గొడవలో ఊహించని  విధంగా బొమ్మను పగలగొట్టేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూస్తేనే కిక్ ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు